ఆ సమయంలో నిమ్మకాయ నీళ్లతో కడుపు నింపుకున్నా.. రవికృష్ణ కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీల సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి.

పైకి సంతోషంగా కనిపించే సెలబ్రిటీలు నిజ జీవితంలో అనుభవించిన కష్టాల గురించి తెలిస్తే కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురి కావాల్సి ఉంటుంది.

బిగ్ బాస్ షో, సీరియళ్ల ద్వారా గుర్తింపును సంపాదించుకున్న రవికృష్ణ( Ravi Krishna ) ఒక సందర్భంలో మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసిన వెంటనే సినిమా ఇండస్ట్రీలోకి రావాలని భావించానని అన్నారు.

5,000 రూపాయల స్నేహితుడి దగ్గర అప్పు చేసి చెన్నైకి వెళ్లానని ఆ డబ్బులు ఖర్చైన తర్వాత తినడానికి తిండి ఉండటానికి స్థలం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని రెండు రూపాయలతో నిమ్మకాయ కొనుక్కొని నిమ్మకాయ నీళ్లు తాగి కడుపు నింపుకున్న సందర్భాలు ఉన్నాయని రవికృష్ణ వెల్లడించారు.

నాన్న ఆర్టీసీ డ్రైవర్ అని ఆర్థికంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నామని రవికృష్ణ పేర్కొన్నారు.

"""/" / రవికృష్ణ ది బర్త్ డే బాయ్( The Birthday Boy Movie ) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాలను వెల్లడించారు.

సీరియల్ నటుడు సినిమాల్లో హీరోలుగా సక్సెస్ కావడం సులువైన విషయం కాదు.రవికృష్ణ టాలెంటెడ్ నటుడు కాగా రాబోయే రోజుల్లో అతని కెరీర్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

రవికృష్ణ రెమ్యునరేషన్( Ravi Krishna Remuneration ) ఒకింత పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.

"""/" / రవికృష్ణ విభిన్నమైన కథలను ఎంచుకుంటే కెరీర్ పరంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

రవికృష్ణ ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే అతని కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

రవికృష్ణను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.బిగ్ బాస్ షో( Bigg Boss ) ద్వారా మంచోడిగా రవికృష్ణ పేరు సంపాదించుకోవడం గమనార్హం.

రవికృష్ణను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

నాన్న కార్మికుడిగా పని చేసిన చోటే కమిషనర్ గా కూతురు.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!