ఈ పాన్ ఇండియన్ హిట్స్ జాబితాలో ‘టైగర్’ కూడా చేరుతుందా?
TeluguStop.com
మాస్ మహారాజ రవితేజ( Ravi Teja ) మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.
ప్రస్తుతం రవితేజ చేస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ''టైగర్ నాగేశ్వరరావు( Iger Nageswara Rao )''.
స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కడంతో మేకర్స్ ఈ సినిమా కంటెంట్ పై చాలా నమ్మకంగా ఉన్నారు.
దీంతో భారీ పోటీ మధ్య కూడా వీరి సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారడానికి సిద్ధం అవుతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకు భారీ అంచనాలు నెలకొన్నాయి.ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టు కోవడంతో ఈ సినిమాకు అంచనాలు బాగానే పెరిగాయి.
ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
"""/" /
ఇలా సినిమా రిలీజ్ కు ఒక్కో పని పూర్తి చేస్తూ సిద్ధం చేస్తున్నారు.
మరి ఈ సినిమా దడపా 3 గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.
ఇంత నిడివితో వస్తే ఆకట్టుకుంటుందా లేదా అనేది చాలా మంది చర్చించు కుంటున్నారు.
మరి ఇదే రన్ టైం తో రీసెంట్ గా మన టాలీవుడ్ నుండి పలు చిత్రాలు వచ్చాయి.
పుష్ప, ఆర్ఆర్ఆర్( RRR ) లాంటివి భారీ హిట్స్ గా నిలిచాయి. """/" /
మరి కంటెంట్ బాగుండాలి కానీ ప్రేక్షకులు రన్ టైం ను పెద్దగా పట్టించుకోరని ఈ సినిమాలతో ప్రూవ్ అయ్యింది.
ఇక ఇప్పుడు టైగర్ విషయంలో కూడా మేకర్స్ ధీమాగా ఉన్నారు.తమ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ సినిమాను బిగ్ హిట్ గా నిలబెడతారని చెబుతున్నారు.
చూడాలి మరి ఈ సినిమా విషయంలో వీరి ఆశలు నెరవేరుతాయో లేదో.
ఆ పాట విని రాత్రి రెండు గంటలకు డ్యాన్స్ చేశా…. వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!