మాస్ రాజా 'ధమాకా'.. ఈసారి కూడా క్రాక్ పుట్టించడానికి రెడీ!

టాలీవుడ్ మాస్ రాజా వరుస ప్లాపులతో సతమత మవుతున్న సమయంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్సినిమాతో రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.

అదే జోష్ తో వరస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఆ జోరులోనే రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.ఈ సినిమాలో విలన్ గా అర్జున్ నటిస్తుండగా.

అనసూయ కూడా కీలక పాత్రలో నటిస్తుంది.దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఇక ఖిలాడీ సెట్స్ మీద ఉండగానే వరుస సినిమాలు ప్రకటిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు.

"""/"/ ప్రెసెంట్ రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాను శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఈ రెండు సినిమాలు రిలీజ్ అవ్వకముందే మరొక సినిమాను ప్రకటించాడు.త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

ఈ రోజు విజయ దశమి సందర్భంగా రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కే సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసారు.

"""/"/ ఈ సినిమా టైటిల్ ను 'ధమాకాఅనే ఫిక్స్ చేయడంతో రవితేజ అభిమానులు మాస్ రాజా కు తగ్గ టైటిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో కూడా రవితేజ డ్యూయెల్ రోల్ లోనే నటిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ పోస్టర్ చూస్తేనే అర్ధం అవుతుంది.ఈసారి కూడా రవితేజ క్రాక్ పుట్టించడం ఖాయం అని.

ఇక ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళ బోతుంది.

ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేరళ ఎన్ఆర్ఐల క్యూ.. పార్టీల ప్రత్యేక ఏర్పాట్లు