'ధమాకా' విషయంలో రిస్క్ వద్దు అంటున్న మాస్ రాజా.. అందుకే అలా సైడ్ అయ్యాడా?

మాస్ మహారాజా అంటేనే ఎనర్జిటిక్ హీరో అని పేరు ఉంది.ఈయన ఎనర్జీని ఎవ్వరు కూడా బీట్ చేయలేరు అనే చెప్పాలి.

ఒకప్పుడు వరుస సూపర్ హిట్స్ తో స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ ఇప్పటికీ అదే స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు.

అయితే అప్పుడు ఉన్నంత సక్సెస్ రేట్ ఇప్పుడు అందుకోలేక పోతున్నాడు.బాక్సాఫీస్ దగ్గర ఒక సినిమాతో సక్సెస్ అందుకుంటే వెంటనే వరుసగా ప్లాప్స్ ఎదురవుతున్నాయి.

ఈ మధ్య అయితే ఈయన సినిమాలు మరిన్ని నష్టాలను చవి చూస్తున్నారు.వరుసగా దారుణంగా నష్టాలు కలుగజేయడంతో నిర్మాతలు ఇచ్చిన కమిట్మెంట్స్ కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నాలు చేసారు.

అయితే రవితేజ ఆ ఆఫర్స్ పోకుండా ఉండడం కోసం తనపై పెట్టుబడి పెట్టే నిర్మాతలకు ఒక ఆఫర్ ఇచ్చాడు.

బిజినెస్ చేసిన తర్వాత తన రెమ్యునరేషన్ చూసుకుందాం అని నిర్మాతలను ఒప్పించాడట.క్రాక్ సినిమా అలానే పూర్తి చేయగా ఇది సూపర్ హిట్ అయ్యింది.

దీంతో ఈ సినిమాకు ముందుగా 5 కోట్ల రెమ్యునరేషన్ అనుకుంటే ఇది హిట్ అవ్వడంతో 15 కోట్ల మేర ప్రాఫిట్ అందుకున్నాడు అని తెలిసింది.

అయితే ఇదే ఫార్ములా తర్వాత రెండు సినిమాలకు వాడినా ఆ సినిమాలు దారుణంగా ప్లాప్ అవ్వడంతో ఈయన రెమ్యునరేషన్ సరిగ్గా అందలేదు.

"""/"/ అయితే ఇప్పుడు ధమాకా సినిమాకు మాత్రం రవితేజ రిస్క్ చేయలేదని.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నుండి సైలెంట్ గా రెమ్యునరేషన్ అందుకున్నాడు అని టాక్.

క్రాక్ హిట్ తో రవితేజ 7 కోట్ల వరకు డిమాండ్ చేయగా అంత మొత్తం ఈ నిర్మాతలు చెల్లించారు అని తెలుస్తుంది.

దీంతో ఈయన కామ్ గా రెమ్యునరేషన్ అందుకుని బిజినెస్ లో వాటా లేదు.

ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ సినిమా కారణంగా రవితేజ నష్టపోయాడు.మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఇలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు.

రైతు చేత వంద మొసళ్లను చంపించిన థాయ్‌లాండ్ ప్రభుత్వం.. ఎందుకంటే..