రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. బ్రేక్‌ ఈవెన్ కష్టమేమి కాదు

రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వం లో రూపొందిన రామా రావు ఆన్ డ్యూటీ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.

హీరో గా రవితేజ గత చిత్రం ఖిలాడి నిరాశ పర్చడం తో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రామా రావు ఆన్ డ్యూటీ సినిమా ఉంటుందనే నమ్మకం ను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని ఈ సినిమా సొంతం చేసుకుంటుందని దర్శకుడు నమ్మకంగా ఉన్నాడు.

మరో వైపు బయ్యర్లు మాత్రం చాలా భయం భయంగా ఉన్నారట.రవితేజ గత చిత్రం ఖిలాడి సినిమా ఫలితం ఈ సినిమా పై పడింది.

బయ్యర్లు ఈ సినిమా ను కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేయడంతో రేట్లు తగ్గించారని తెలుస్తోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామా రావు ఆన్ డ్యూటీ సినిమా అన్ని ఏరియాల్లో కలిపి రూ.

17.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట.

18 కోట్ల రూపాయల షేర్ ను వసూళ్లు చేస్తే బ్రేక్ ఈవెన్ సాధించినట్లే.

ఇక 25 కోట్ల రూపాయల వసూళ్లను ఈ సినిమా రాబట్టినట్లయితే బ్లాక్ బస్టర్ హిట్‌ అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.

హీరోగా రవితేజ గత చిత్రం ఫలితం పక్కన పెడితే ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉంది.

సినిమా మినిమం గా ఆడినా కూడా భారీ గా వసూళ్లు నమోదు అయిన సందర్బాలు చాలా ఉన్నాయి.

అందుకే రామా రావు ఆన్ డ్యూటీ సినిమా కాస్త పర్వాలేదు అనిపించినా కూడా బ్లాక్ బస్టర్ వసూళ్లు నమోదు అవ్వడం లో అనుమానం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియా లో రామా రావు ఆన్ డ్యూటీ సినిమా ను యూనిట్‌ సభ్యులు బాగానే ప్రమోట్‌ చేస్తున్నారు.

కనుక చాలా స్పీడ్‌ గానే సినిమా బ్రేక్ ఈవెన్‌ సాధించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

మరి కొన్ని గంటల్లో రాబోతున్న సినిమా ఫలితం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అభిమానికి మూడు లక్షల రూపాయల గిఫ్ట్ ఇచ్చిన చిరు.. అలా చేసి మెగాస్టార్ అనిపించుకున్నారుగా!