రవితేజ మూడవది కూడా ప్రకటించేశాడు.. బాబోయ్ ఏంటీ ఈ స్పీడ్‌

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమా లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

రమేష్ వర్మ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ సినిమా నిరాశ పరిచిన కూడా రవితేజ సినిమా లు వరుసగా విడుదలకు సిద్ధ మవుతున్నాయి.

ఈ సమ్మర్ లో రామారావు ఆన్ డ్యూటీ విడుదల కాబోతున్న విషయం ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

ఇదే సమయంలో రవితేజ మరో సినిమా కూడా ఈ ఏడాది విడుదల చేయబోతున్నట్లు గా ప్రకటన వచ్చింది.

రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమా సమ్మర్ లో విడుదల కానుండగా ఆ తర్వాత ధమాకా సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అధికారిక ప్రకటన విడుదల అయ్యింది.

త్రినాధరావు నక్కిన దర్శకత్వం లో రూపొందుతున్న ధమాకా సినిమా నుండి నేడు పోస్టర్ ను అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

ఆ పోస్టర్ లో విడుదల తేదీని ఇదే ఏడాది గా పేర్కొంటూ ప్రకటించిన నేపథ్యం లో రవితేజ నుండి 2022 సంవత్సరం లోనే ఏకంగా మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయని  క్లారిటీ వచ్చింది.

అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే కచ్చితంగా ఇదే ఏడాదిలో ఆయన నుండి మరో సినిమా వచ్చినా ఆశ్చర్యం లేదు.

"""/" / ఎందుకంటే సంక్రాంతి కి రావణాసుర అనే సినిమా కూడా పట్టాలెక్కింది.

ఆ సినిమాను సమ్మర్ వరకు పూర్తి చేసి ఇదే ఏడాది చివర్లో విడుదల చేసినా కూడా ఆశ్చర్యం లేదు.

అదే జరిగితే ఈ ఏడాదిలోనే రవితేజ నుండి ఏకంగా నాలుగు సినిమాలు విడుదల అయినట్లు తెలుస్తుంది .

ఒకే ఏడాదిలో  నాలుగు సినిమా లు విడుదల చేసిన అరుదైన ఘనత మాస్  మహారాజా రవితేజ కి దక్కబోతుందేమో చూడాలి.

ఈ నాలుగు సినిమాలు రెండు సినిమాలు సక్సెస్ అయినా కూడా రవితేజ అభిమానులకు పండగే.

“ఫాస్ట్‌గా రా.. మూడ్‌లో ఉన్నా”: ఉబర్ డ్రైవర్ అసభ్య మెసేజ్‌లు.. తర్వాతేం జరిగిందో తెలిస్తే..