త్రినాధ్ రావు సినిమా అఫీషియల్ కన్ఫర్మ్.. త్వరలో లాంచింగ్

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు.క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా నడుస్తుంది.ఈ సినిమా తర్వాత గ్యాప్ లేకుండా మరో సినిమాని పట్టాలేక్కించే పనిలో ఉన్నాడు.

ఈ నేపధ్యంలో ఇప్పటికే త్రినాధ్ రావు నక్కిన, వక్కంతం వంశీలని లైన్ లో ఉంచాడు.

అయితే వీళ్ళ కథలు ఒకే చెప్పాడని టాక్ వచ్చిన అఫీషియల్ గా మాత్రం కన్ఫర్మ్ కాలేదు.

అయితే ఇప్పుడు త్రినాధ్ రావు నక్కిన సినిమాకి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది.

ఫుల్ కామెడీ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా త్రినాధ్ రావు గత చిత్రాల మాదిరిగానే రవితేజ సినిమా కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఇదే విషయాన్ని చిత్రాన్ని ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించనున్నారు.

వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత.రవితేజకి ఇది 68వ సినిమా.

ప్రసన్నకుమార్‌ బెజవాడ కథ–స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.యంగ్ రైటర్ గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రసన్నకుమార్, టాలెంటెడ్ దర్శకుడు త్రినాధ్ రావు నక్కిన హిట్ కాంబినేషన్ అనే విషయం అందరికి తెలిసిందే.

వీరిద్దరి కలయికలో వస్తున్న నాలుగో సినిమా ఇదే.ఖిలాడీ షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన హీరోయిన్స్, ఇతర క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో చిత్ర దర్శకుడు ఉన్నట్లు తెలుస్తుంది.

విజయనగరం యువగళం సభలో లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!