వైరల్ వీడియో: సరికొత్తగా ప్రమోషన్స్ తో దూసుకెళ్తున్న ‘మిస్టర్ బచ్చన్’..
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజుగా పిలిచే రవితేజ,( Ravi Teja ) హరీష్ శంకర్ డైరెక్షన్లో రాబోతున్న సినిమా 'మిస్టర్ బచ్చన్'.
( Mr Bachchan ) ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇక క్రమంలో సినిమా యూనిట్ మూవీ ప్రమోషన్స్ ను సాధారణంగా కాకుండా 'మిస్టర్ బచ్చన్' టీం కాస్త వెరైటీగా సినిమా ప్రమోషన్ ను చేసి అందర్నీ ఆకట్టుకుంటుంది.
ఈనేపధ్యంలో రవితేజ వాయిస్ మెసేజ్ తో ప్రమోషన్స్ చేసి ఫాన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నరు.
"""/" /
'మిస్టర్ బచ్చన్' టీం సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ మెట్రో రైలు( Hyderabad Metro Train ) ఎంచుకొని మరి 'మెట్రో ప్రయాణికులకు స్వాగతం సుస్వాగతం.
ఏం తముళ్లు మెట్రోలో ప్లేస్ దొరకలేదా.? లేదా కూర్చోగానే లేపేస్తున్నారా.
? ఏం పర్వాలేదు.మిస్టర్ బచ్చన్ నుంచి లేటెస్ట్ గా ఓ పాట రిలీజు అయ్యింది.
హ్యాపీగా వినుకుంటూ నిల్చోని మీరు దిగాల్సిన స్టేషన్ వచ్చేదాకా హాయిగా వెళ్లిపోండి.ఇక్కడ సీట్ దొరక్కపోయినా పర్వాలేదు.
ఆగస్టు 15న మాత్రం థియేటర్‌కు వచ్చేయండి.అక్కడ సీట్ గ్యారెంటీ' అంటూ.
రవితేజ వాయిస్ తో ప్రయాణికులకు ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చాడు. """/" /
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
ఇది ఇలా ఉండగా.మరోవైపు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమా 1980-90 ల్లో సాగే కథ.రవితేజ ఒక నిజాయితీగల ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
గతంలో డైరక్టర్ హరీశ్ శంకర్ రవితేజ కలిసి 'మిరపకాయ్' సినిమాతో అదరగొట్టిన సంగతి అందరికి విదితమే.
వీరి కాంబోలో మరోసారి సినిమా విడుదలపై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
స్టార్ యాంకర్ ఝాన్సీ కూతురిని చూశారా.. ఈమె కచ్చితంగా హీరోయిన్ అవుతుందంటూ?