రవితేజ తన ఇద్దరు రూమ్ మేట్స్ తో కలిసి తీసిన సినిమా ఏంటో తెలుసా..?

ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చి టాప్ హీరోగా ఎదిగిన న‌టుడు ర‌వితేజ‌.

మిత్రుల స‌హాయంలో చిన్నా చిత‌కా వేషాల నుంచి మంచి హీరోగా గుర్తింపు పొందాడు.

లక్ష‌లాది మంది ప్రేక్ష‌కుల‌ను సంపాదించుకున్నాడు.ర‌వితేజ మూవీ అంటే మినిమ‌మ్ గ్యారెంటీ అనే లెవ‌ల్ కు చేరాడు.

చెన్నైలో సినిమా అవ‌కాశాల కోసం తిరుగుతున్న స‌మ‌యంలో క‌లిసిన మిత్రుల‌తో రవితేజ హీరో అయ్యాక ఓ సినిమా రూపొందించారు.

ఇంతకీ ఆ సినిమా ఏంటి.? అది విజ‌యం సాధించిందా? లేదా? అనే విష‌యాన్నిఇప్పుడు తెలుసుకుందాం! ర‌వితేజ చెన్నైకి వెళ్లిన స‌మ‌యంలో అప్ప‌టికే అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేస్తున్న వైవీఎస్ చౌద‌రి ప‌రిచ‌యం అయ్యాడు.

అనంత‌రం వాళ్లు మంచి ఫ్రెండ్స్ అయ్యారు.ఇద్ద‌రూ క‌లిసి ఒకే రూమ్‌లో ఉన్నారు.

ఆ త‌ర్వాత వీరితో గుణ శేఖ‌ర్ క‌లిశాడు.ముగ్గురూ క‌లిసి ఉంటూ సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించి సంపాదించారు.

ఈ ముగ్గురూ డైరెక్ట‌ర్లుగా కావాల‌నుకున్నా ర‌వితేజ హీరోగా మారాడు.వైవీఎస్ చౌద‌రి ద‌ర్శ‌క నిర్మాత‌గా ఎదిగాడు.

"""/"/ ఈ ముగ్గురు మిత్రులు క‌లిసి నిప్పు అనే సినిమా తీశారు.ఈ సినిమాకు గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ర‌వితేజ హీరోగా న‌టించాడు.వైవీఎస్ చౌద‌రి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు.

2012లో విడుద‌ల అయిన ఈ సినిమా మంచి హిట్ సాధించింది.బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది.

20 కోట్ల‌తో తీసిన ఈ సినిమా 46 కోట్ల రూపాయ‌ల గ్రాస్ ను సంపాదించింది.

ఈ సినిమాతో ఈ ముగ్గురు మిత్రుల మ‌ధ్య స్నేహం మ‌రింత బ‌ల‌ప‌డింది.‌ అటు చెన్నైలో ఉండ‌గా ర‌వితేజ‌కు ప‌రిచ‌యం అయిన పూరీ జ‌గ‌న్నాథ్, కృష్ణవంశీ త‌న సినీ కెరీర్‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ్డారు.

పూరీ జ‌గ‌న్న‌థ్ ర‌వితేజ‌తో వ‌రుస సినిమాలు తీసి సూప‌ర్ హిట్లు అందించాడు.టాప్ హీరోగా మ‌లిచాడు.

ర‌వితేజను మాస్ మ‌హ‌రాజ్‌గా తీర్చిదిద్దాడు.మొత్తంగా త‌న మిత్రుల స‌హాయ స‌హ‌కారాల‌తో ర‌వితేజ ఫుల్ సక్సెస్‌పుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు.

ఆ నగరంలో క్రికెట్ బ్యాన్.. ఎందుకో తెలుసా..?