మాస్ మహారాజ్ అంటే ఇదీ.. బిగ్ బాస్ కంటెస్టెంట్ కు ఇచ్చిన మాటను రవితేజ నిలబెట్టుకున్నాడుగా!

తెలుగు ప్రేక్షకులకు బుల్లితెరి నటుడు అమర్ దీప్ చౌదరి( Amardeep Chaudhary ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తెలుగులో పలు సీరియల్స్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపును ఏర్పరచుకున్న అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు.

ఎట్టకేలకు ఫైనల్ వరకు చేరుకున్నప్పటికీ రన్నరప్ గా నిలిచి సరి పెట్టుకున్నారు.ఇకపోతే మాస్ మహారాజ రవితేజ( Mass.

Maharaja Ravi Teja ) ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు.రవితేజ అంటే అమర్ దీప్ కు చాలా ఇష్టం.

ఇదే విషయాన్ని చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు. """/" / అమర్‌ చూపిన అభిమానానికి ఫిదా అయిన రవితేజ కూడా ఒక ఆఫర్‌ ప్రకటించాడు.

తన నటించబోయే సినిమాలో ఒక మంచి పాత్ర ఇస్తున్నట్లు బిగ్‌ బాస్‌ వేదికగా ప్రకటించాడు.

తాజాగా రవితేజను అమర్‌ దీప్‌ కలుసుకున్నాడు.అందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

నా డ్రీమ్‌ నిజం అయిందంటూ అమర్‌ చెప్పుకొచ్చాడు.రవితేజతో కలిసి నటించే ఛాన్స్‌ వచ్చినట్లు తెలిపాడు.

దీంతో అభిమానులు కూడా అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.ఇచ్చిన మాటను రవితేజ నిలిబెట్టుకున్నారని ఫ్యాన్స్‌ గుర్తుచేస్తున్నారు.

"""/" / బిగ్‌ బాస్‌ టైటిల్‌ రేసు నుంచి తప్పుకుంటే రవితేజ సినిమాలో ఛాన్స్‌ ఇప్పిస్తానని హోస్ట్‌ నాగార్జున చెప్పగానే అమర్‌ కూడా అందుకు రెడీ అంటూ.

బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తాడు.దానిని గమనించిన రవితేజ సినిమాలో ఛాన్స్‌ ఇస్తున్నట్లు అదే స్టేజీ మీద మాట ఇస్తాడు.

105 రోజులు కష్టపడ్డావ్‌ ఆట పూర్తి అయ్యే వరకు ఉండమని రవితేజ కోరుతాడు.

దీంతో ఫుల్‌ ఖుషి అయిన అమర్‌కు ఎట్టకేలకు తన అభిమాన హీరోతో కలిసి నటించే ఛాన్స్‌ దక్కిందని ఫుల్ గా సంతోషపడతాడు.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు రవితేజ పై కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.