సన్నాఫ్‌ ఇండియాకు ఖిలాడి జలక్ ఇచ్చేనా?

కరోనా కారణంగా ఎన్నో సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చాయి.మూడు వేవ్‌ ల కరోనా సినిమా ఇండస్ట్రీ ని అతలాకుతలం చేసింది.

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పదుల సంఖ్య లో పెద్ద సినిమా లు విడుదల వాయిదా పడ్డాయి.

ఎట్టకేలకు కరోనా మూడవ వేవ్‌ ప్రభావం తగ్గడం తో మళ్లీ సినిమాల జాతర మొదలు పెట్టేందుకు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ రెడీ అవుతున్నారు.

పెద్ద ఎత్తున సినిమాలను మార్చి నుండి వరుసగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ ఫిబ్రవరి లో కూడా పెద్ద సినిమాలు విడుదల ఉన్నాయి.అయితే ఆంధ్రప్రదేశ్లో టికెట్ల విషయం ఎటూ తేలక పోవడం తో కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

రవితేజ నటించిన ఖిలాడి సినిమా ను ఫిబ్రవరి 11 వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

కానీ ఇప్పుడు ఆ తేదీని మార్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ను ఫిబ్రవరి 14 వరకు పొడిగిస్తున్నట్లు గా ప్రకటించింది.

తద్వారా ఏపీ లో ఖిలాడి సినిమా నష్టపోయే అవకాశం ఉందనే ఉద్దేశంతో విడుదల తేదీని ఫిబ్రవరి 18కి వాయిదా వేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఫిబ్రవరి 18 వరకు నైట్ కర్ఫ్యూ తొలగించడంతో పాటు టికెట్ రేట్ల విషయం లో ఒక నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

అందుకే ఫిబ్రవరి 18వ తేదీ ని కన్ఫర్మ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.అయితే మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా ను కూడా అదే ఫిబ్రవరి 18న విడుదల చేయబోతున్నట్లు అధికారికం గా ప్రకటించారు.

"""/"/ దాంతో ఇప్పుడు మోహన్ బాబు మరియు రవితేజ ల మధ్య పెద్ద క్ల్యాష్‌ తప్పదేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారి లో చర్చ జరుగుతోంది.

ఒక వేళ రెండు సినిమా లు ఒకే రోజు విడుదల అయితే కచ్చితంగా మోహన్ బాబు నటించిన సన్నాఫ్‌ ఇండియా సినిమా కు భారీ నష్టం తప్పదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి మోహన్‌ బాబు తన సినిమాను వాయిదా వేసుకుంటారా లేదంటే రవితేజతో ఢీ అంటారో చూడాలి.

పుష్ప2 కోసం సుకుమార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. దిమ్మతిరిగి పోవాల్సిందే!