రెమ్యూనరేషన్ భారీగా పెంచిన రవితేజ.. 68వ సినిమాకు ఏకంగా..

సంక్రాంతికి రిలీజైన క్రాక్ సినిమాతో మాస్ మహారాజ రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.

అంతేకాదు తన ఇమేజ్ కూడా పెంచుకున్నాడు.మళ్ళీ మాస్ మహారాజా రవితేజ అని అనిపించుకున్నాడు.

వరస పెట్టి సినిమాలు చేస్తూ మంచి జోరు మీద ఉన్నాడు.ఆ జోరులోనే రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైద్రాబాదులో శరవేగంగా జరుగుతుంది.క్రాక్ సినిమా కరోనా తర్వాత రిలీజైన మొదటి స్టార్ హీరో సినిమా కావడంతో అందులోనూ కథ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపారు.

క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కుమ్మేయడంతో రవితేజ తన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచినట్లు టాలీవుడ్ వర్గాల్లో నుండి వస్తున్న సమాచారం.

ఖిలాడీ సినిమా తర్వాత రవితేజ మరో సినిమా చేయబోతున్నాడు.ఫిబ్రవరి 21 న తన 68వ సినిమాను ప్రకటించాడు.

ఈ సినిమాను త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేయబోతున్నాడు. """/"/ ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేర్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్నట్లు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ లు తెలిపారు.

రవితేజ ఈ సినిమాకు ఏకంగా తన రెమ్యూనరేషన్ 60 శాతం పెంచినట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

క్రాక్ సినిమా కోసం రవితేజ రెమ్యూనరేషన్ తో పాటు కలెక్షన్స్ లో కూడా వాటా తీసుకున్నాడట.

ఈ సినిమా కోసం 16 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.త్రినాథరావు ఈ సినిమాను హిల్లేరియస్ కామెడీ మూవీగా తెరకెక్కిస్తున్నాడట.

ఈ చిత్రంలో రవితేజ డిటెక్టీవ్ పాత్రలో కనిపించి సినిమా మొత్తం కడుపుబ్బా నవ్వించబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వస్తున్నా టాక్.

అంతేకాదు ఈ సినిమాకు చిరంజీవి పాత సినిమా టైటిల్ 'చంటబ్బాయ్' టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

జగన్ కాదు కూటమే టార్గెట్ .. షర్మిల లో మార్బుకు కారణం ఎవరు ?