మాస్ రాజా – హరీష్ మూవీ అనౌన్స్ మెంట్.. ఇదే నెలలో ఉండబోతుందా?

మాస్ మహారాజా రవితేజ( Raviteja ) స్పీడ్ ను ఏ హీరో కూడా తట్టుకోలేడు.

ఈయన వరుసగా నాలుగైదు సినిమాలు ప్రకటిస్తూ వాటిని ఒకదాని వెంట ఒకటి పూర్తి చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకు పోతుంటాడు.

గతంలో ప్రకటించిన అన్ని సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి రిలీజ్ చేయడంతో ఈయన చేతిలో ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా( Tiger Nageswara Rao ) మాత్రమే ఉంది అనుకునే మళ్ళీ వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు.

వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది.దీని తర్వాత వెంటనే మరో సినిమాను రిలీజ్ కు ప్లాన్ చేసేలా సినిమాలను ప్రకటించాడు.

ఇటీవలే దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ సినిమా( Eagle Movie ) ప్రకటించాడు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది 2024 సంక్రాంతి టార్గెట్ గా రిలీజ్ కాబోతుంది.

"""/" / అలాగే దీంతో పాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీస్ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమా మాత్రమే కాదు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా కూడా ఓకే చేసారని టాక్.

ఇంకా దిల్ రాజు ధమాకా హిట్ ఇచ్చిన త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో మరో సినిమా కూడా ఉంది.

ఇన్ని సినిమాలు లైన్లో ఉండగానే గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో( Director Harish Shankar ) కూడా సినిమా ఉంది అని ప్రకటన రాబోతుంది అని ఇప్పుడు తాజాగా సమాచారం అందుతుంది.

"""/" / హరీష్ శంకర్ సన్నిహితులు ఈ వార్తను లీక్ చేసినట్టు టాక్.

ఈ నెలలోనే ఈ సినిమా అఫిషియల్ అప్డేట్ వస్తుందట.చూస్తుంటే రవితేజ 2024 ఏడాదికి కూడా సరిపడా సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది.

మొత్తానికి మాస్ రాజా మరోసారి జెట్ స్పీడ్ తో దూసుకు పోయేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?