కొత్త దర్శకుడు కథకి ఒకే చెప్పిన రవితేజ

కొత్త దర్శకుడు కథకి ఒకే చెప్పిన రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

కొత్త దర్శకుడు కథకి ఒకే చెప్పిన రవితేజ

వరుసగా మూడు ఫ్లాప్ ల తర్వాత రవితేజ నుంచి ఫ్యాన్ కోరుకునే అన్ని అంశాలతో వచ్చిన పవర్ ఫుల్ ప్యాక్ మూవీ క్రాక్.

కొత్త దర్శకుడు కథకి ఒకే చెప్పిన రవితేజ

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ తన ఫుల్ ఎనర్జీని ఉపయోగించాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా మీద భారీగానే అంచనాలు ఉన్నాయి.వీటి తరువాత త్రినాధరావు నక్కిన, వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఒకే చెప్పి ఉన్నాడు.

ఈ ఏడాదిలోనే ఈ రెండు సినిమాలు కూడా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే కొత్త దర్శకులని పరిచయం చేయడంలో రవితేజ ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు.

శ్రీనువైట్ల, గోపీచంద్ మలినేని, కెఎస్ రవీంద్ర లాంటి దర్శకులని రవితేజని పరిచయం చేశాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త టాలెంటెడ్ దర్శకుడుకి మెగా ఫోన్ పట్టె ఛాన్స్ ఇవ్వబోతున్నాడు.

సర్దార్‌ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు లాంటి సినిమాలకు పని చేసిన గులాబి శ్రీను అనే కొత్త కుర్రాడు గతేడాది రవితేజకు పాయింట్‌ చెప్పాడట.

గులాబి శ్రీను క్రాక్‌ సినిమాకు కో డైరక్టర్‌గా కూడా పని చేశాడు.ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు.

ఆ క్రమంలోనే గతేడాది రవితేజకు ఓ కథ చెప్పాడట.అది నచ్చడంతో పూర్తి చేయమని చెప్పాడని తెలుస్తుంది.

ప్రస్తుతం గులాబి శ్రీను అదే పనిలో ఉన్నాడని సమాచారం.ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం కాగానే ఒకసారి విని కరెక్షన్ ఉంటే చేసి ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్దామని రవితేజ హామీ ఇచ్చినట్లు బోగట్టా.

వినోదాత్మకంగానే ఉంటూనే రవితేజలో కొత్త కోణం చూపించేలా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తుంది.

కృష్ణ మృతికి మహేష్ బాబు కారణం… సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి! 

కృష్ణ మృతికి మహేష్ బాబు కారణం… సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి!