Eagle : రవితేజ ఈగల్ మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే.. ఆ ఒక్క మాటతో సినిమా జాతకం తేలిపోయిందిగా!

టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) హీరోగా నటించిన తాజా చిత్రం ఈగల్.

ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు.

ఈగల్( Eagle ) వీక్షించిన రవితేజ ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు.ఫుల్ శాటిస్‌ఫైడ్ అంటూ ఒక్క మాటలో తన సినిమా మీద రివ్యూ ఇచ్చేసుకున్నాడు రవితేజ.

చాలా బాగుందన్నట్టుగా రవితేజ చెప్పకనే చెప్పేశాడు.దర్శక నిర్మాతలు కూడా ఫుల్ ఖుషీగానే కనిపిస్తున్నారు.

ఇలా మొత్తానికి ఈగల్ ఫస్ట్ రివ్యూ మాత్రం రవితేజ నోటి నుంచే వచ్చేసింది.

"""/" / ఇకపోతే ఈ మధ్యకాలంలో రవితేజ పరిస్థితి ఒక్క హిట్టు నాలుగైదు ఫ్లాపులు అన్నట్టుగా సాగుతోంది.

క్రాక్ సినిమా తర్వాత వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న రవితేజ ఒక సినిమా హిట్ అయితే రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.

ధమాకా తరువాత మళ్లీ హిట్టు కొట్టలేకపోతున్నాడు.ఒక హిట్టు నాలుగైదు ఫ్లాపులు అన్నట్టుగా సాగుతోంది.

వాల్తేరు వీరయ్య విజయం అంతా చిరు ఖాతాలోకి వెళ్లింది.కొంత మంది అది రవితేజ వల్లే ఆడిందంటూ కామెంట్లు కూడా చేశారు.

రావణాసుర, రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు( Ravanasura, Rama Rao On Duty, Tiger Nageswara Rao ) ఇలా అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచాయి.

"""/" / ఇప్పుడు రవితేజ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్న ఈగల్ సినిమా వచ్చేస్తోంది.

మామూలుగానే సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేశారు.పీపుల్స్ మీడియా తమ ఈగల్ సినిమాను వాయిదా వేసేందుకు అనుమతి ఇచ్చింది.

సంక్రాంతి బరి మరింత టైట్ చేయడం ఇష్టం లేక తప్పుకున్నట్టుగా ప్రకటించింది.మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాతో హీరో రవితేజ తప్పకుండా విజయం సాధిస్తాడు అని అర్థం అవుతోంది.

ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని హీరో రవితేజ తో పాటు చిత్ర బృందం కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

డాకు మహారాజ్ ప్రమోషన్స్ విషయంలో అసంతృప్తిలో అభిమానులు.. రికార్డులు క్రియేటవుతాయా?