మాస్ రాజా యమ స్పీడ్..అప్పుడే 'ధమాకా' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!

మాస్ మహారాజా కెరీర్ లో ఎప్పుడు జెట్ స్పీడ్ తోనే దూసుకు పోతాడు.

ఏడాదికి మూడు నాలుగు సినిమాలను పక్కాగా విడుదల చేస్తాడు.అయితే కరోనా వల్ల గత రెండు సంవత్సరాలు స్పీడ్ తగ్గించాడు.

ఇక మళ్ళీ ఈ మధ్యనే వరుస సినిమాలు ప్రకటిస్తూ మళ్ళీ పాత స్పీడ్ ను కంటిన్యూ చేస్తున్నాడు.

ప్రెసెంట్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాలో రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు.

ఇక ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.ఖిలాడీ సెట్స్ మీద ఉండగానే వరుస సినిమాలు ప్రకటిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు.

ఖిలాడీ సినిమాతో పాటు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.

శరత్ మండవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇక ఈ రెండు సినిమాలు రిలీజ్ అవ్వకముందే మరొక సినిమాను ప్రకటించాడు.

విజయ దశమి సందర్భంగా రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.

ఆ రోజే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు.

ఈ సినిమాకు 'ధమాకా' అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసారు.

"""/"/ ఈ సినిమాలో కూడా రవితేజ డ్యూయెల్ రోల్ లోనే నటిస్తున్నట్టు తెలుస్తుంది.

దసరా రోజునే ప్రకటించిన ఈ సినిమా అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల రవితేజకు జోడీగా నటిస్తుంది.

ఈ సినిమాను టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇంత త్వరగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేయడంతో అందరు ఆశ్చర్య పోతున్నారు.

మిగతా హీరోలతో పోలిస్తే రవితేజ యమ స్పీడ్ గా దూసుకు పోతున్నాడనే చెప్పాలి.

Ram Pothineni : ఇస్మార్ట్ శంకర్ తో రామ్ క్రేజ్ ఎంతలా పెరిగిందంటే..?