కథ నచ్చితే చాలు.. ప్లాప్ ఉన్న పట్టించుకోను అంటున్న మాస్ రాజా!

మాస్ మహారాజా రవితేజ ప్రెసెంట్ రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ''ధమాకా'' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఇటీవల కాలంలో మాస్ మహారాజా రవితేజ సినిమాలకు భారీ క్రేజ్ రావడం లేదు.

అందుకు చాలా కారణాలే ఉన్నాయి.ఈయన ఒక సినిమాతో హిట్ అందుకుంటే వరుస ప్లాప్స్ అందుకుంటున్నాడు.

దీంతో రవితేజ సినిమాలు అంటే క్రేజ్ తగ్గిపోతుంది.అయితే తాజాగా రిలీజ్ చేయబోయే సినిమాపై మాత్రం ఎప్పుడు లేనంత క్రేజ్ పెరిగి పోయింది.

రవితేజ కూడా ఈ సినిమా కోసం రెండు వారాల ముందు నుండే వరుస ప్రొమోషన్స్ లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నాడు.

ఈ ప్రొమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాస్ రాజా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

దర్శకుడి హిట్.ప్లాప్ ఆధారంగా అతడి సామర్ధ్యాన్ని మనం అంచనా వేయలేమని రవితేజ తెలిపారు.

తనకు కథ నచ్చితే పాత సినిమాల ఫలితాలను పరిగణలోకి తీసుకోనని చెప్పుకొచ్చారు.అయితే ప్రీ ప్రొడక్షన్ సమయంలో మాత్రం కొన్ని సూచనలు చేస్తానని.

ఒక్కసారి కథ లాక్ అయితే తాను జోక్యం చేసుకోనని రవితేజ చెప్పారు.ఇంకా ఛాన్స్ ఏదైనా దొరికితే మాత్రం స్క్రిప్ట్ లో మెరుగులు దిద్దుతానని తెలిపాడు.

"""/"/ ఇక ఈ సినిమా విషయానికి వస్తే.ధమాకా సినిమాలో రవితేజకు జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.

ఈ సినిమాను క్రిస్మస్ బరిలో దింపబోతున్న విషయం తెలిసిందే.డిసెంబర్ 23న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

వివేక్ కూచిభట్ల సహా నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇంక భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.మరి 2022 చివరిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

కెనడాలో ముగిసిన కాన్సులర్ క్యాంప్‌లు .. ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఎంబసీ