సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ…డైరెక్టర్ ఎవరంటే..?

మాస్ మహారాజా గా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో రవితేజ.

( Ravi Teja ) ఈయన మొదటి నుంచి కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఏదో ఒక రకంగా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటున్నాడు.

ప్రస్తుతం రవితేజ లాంటి నటుడు సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారనే చెప్పాలి.

ఎందుకంటే ఆయన మీడియం రేంజ్ హీరోగా కొనసాగుతున్నప్పటికి ప్రొడ్యూసర్స్ హీరోగా మొదటి నుంచి చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

"""/" / ఆయనతో సినిమా చేస్తే పెట్టిన డబ్బులు మాత్రం ఈజీగా రికవరీ అవుతాయనే ఒక కాన్ఫిడెంట్ ని ప్రొడ్యూసర్స్ కి ఇచ్చిన హీరో కూడా రవితేజనే కావడం విశేషం.

మరి తన లాంటి హీరో ఈ మధ్య చేస్తున్న చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించడం లో వెనకబడి పోతున్నాయనే చెప్పాలి.

మరి ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా ఆయన మంచి సక్సెస్ ని సాధిస్తేనే ఆయనకు ఒక మంచి గుర్తింపైతే ఉంటుంది.

లేకపోతే మాత్రం ఆయన ఇమేజ్ డౌన్ ఫాల్ అవుతుందనే చెప్పాలి. """/" / ఇక ఇదిలా ఉంటే సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో( Sithara Entertainments ) రవితేజ ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

ఇంతకు ముందు సితార బ్యానర్ లో మ్యాడ్ సినిమాతో( Mad Movie ) మంచి విజయాన్ని అందుకున్న కళ్యాణ్ శంకర్( Kalyan Shankar ) దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తానని రవితేజ మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.

ఇక ప్రస్తుతం కళ్యాణ్ శంకర్ సినిమా మ్యాడ్ 2 సినిమాను చిత్రికరిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా తర్వాత రవితేజ సినిమా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

జపాన్ లో ఆ తేదీన రిలీజ్ కానున్న దేవర.. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా?