Ravi Teja:మళ్లీమళ్లీ పారితోషికాన్ని పెంచేస్తున్న మాస్ మహారాజ్.. రెమ్యునరేషన్ ఎంతంటే?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు మాస్ మహారాజా రవితేజ( Mass Maharaja Ravi Teja ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రవితేజ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.

కాగా రవితేజ ఇటీవలే రావణాసుర సినిమాతో( Ravanasura Movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన రవితేజ ఆ తర్వాత వరుసగా ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాకా, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తున్నాడు. """/" / ఈ సినిమా అక్టోబర్ 20న విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఒకరి తర్వాత ఒకరు రెమ్యున‌రేష‌న్( Remuneration ) ని అమాంతం పెంచేస్తున్నారు.

హీరోలు కోట్లకు కోట్లు రెమ్యున‌రేష‌న్ పెంచుతుండడంతో నిర్మాత‌లు కూడా వారు అడిగినంత ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు.

సినిమా హిట్ట‌యితే రెమ్యున‌రేష‌న్ పెంచ‌డం సాధార‌ణ‌మే.కానీ ఫ్లాప్ అయినా కూడా హీరోలు త‌గ్గ‌డం లేదు.

సినిమా సినిమాకీ డోసు పెంచుతున్నారు. """/" / అటువంటి వారిలో హీరో రవితేజ కూడా ఒకరు.

ఇటీవల రవితేజ నటించిన రావణాసుర సినిమా ఫ్లాప్ అయినప్పటికీ రవితేజ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

వరుసగా చేతినిండా బోలెడు సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు మాస్ మహారాజ.సినిమాలు అవకాశాల విషయంలో మాత్రమే కాకుండా పారితోషికం విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.

ఈ క్రమంలోనే సందిప్ రాజ్( Sandeep Raj ) ద‌ర్శక‌త్వంలో ఒక సినిమాలో న‌టించ‌డానికి సిగ్నల్ ఇచ్చాడు రవితేజ.

పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.కాగా ఈ సినిమాకి గానూ రూ.

25 కోట్ల పారితోషికం అందుకొంటున్నాడు మాస్ మ‌హారాజా.ధ‌మాకా కూడా ఇదే బ్యాన‌ర్‌లో వ‌చ్చి మంచి లాభాల్ని అందుకొంది.

అందుకే ర‌వితేజ అడిగినంత పారితోషికం ఇవ్వ‌డానికి నిర్మాత‌లు కూడా రెడీ అయ్యారు.ఇదో మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ కాగా ఇందులో ఒక యువ హీరో కూడా న‌టిస్తున్నాడు.

ఆ యంగ్ హీరో మరి ఎవరో కాదు హీరో శ‌ర్వానంద్ అని తెలుస్తోంది.

కుక్క ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే.. ఏనుగు ముందు నిలబడి ఏం చేసిందో చూడండి!