నెట్టింట వైరల్.. పేరు మార్చుకున్న రవితేజ.. కారణమేంటంటే..

నెట్టింట వైరల్ పేరు మార్చుకున్న రవితేజ కారణమేంటంటే

మాస్ మహారాజా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకు పోతున్నాడు.

నెట్టింట వైరల్ పేరు మార్చుకున్న రవితేజ కారణమేంటంటే

ఏ హీరో చేయనంత ఫాస్ట్ గా ఈయన ఏడాదికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ కుర్ర హీరోలకు సైతం దడ పుట్టిస్తున్నాడు.

నెట్టింట వైరల్ పేరు మార్చుకున్న రవితేజ కారణమేంటంటే

ఇటీవలే రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన 'ఖిలాడీ' సినిమా రిలీజ్ అయ్యింది.

కానీ మిక్సెడ్ టాక్ తెచ్చుకుని యావరేజ్ గా మాత్రమే మిగిలి పోయింది.ఈ సినిమా తర్వాత రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్ ఈ సినిమాపై మరింత శక్తిని పెంచేసాయి.

ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రాజిషా విజయాన్ కథానాయికలుగా చేస్తున్నారు.

ఈ యాక్షన్ సినిమాలో వేణు తొట్టెంపూడి కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పీ, ఆర్టి టీమ్ వర్క్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ 2022 మార్చి 25న వెండి తెరమీద కు రాబోతుంది.

ప్రెసెంట్ ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.అయితే తాజాగా రవితేజ చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

రవితేజ తాజాగా తన పేరును మార్చుకున్నాడు.తన సోషల్ మీడియా హ్యాండిల్ లో రవితేజ కొత్త పేరు పెట్టుకున్నాడు.

"""/"/ 'రవితేజ ఆన్ డ్యూటీ' అంటూ రవితేజ పేరును మార్చుకున్నాడు.దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు నెట్టింట తెగ వైరల్ చేసేసారు అభిమానులు.

కేవలం రవితేజ మాత్రమే కాకుండా ఈ సినిమా యూనిట్ మొత్తం ఇలాగె పేర్లు మార్చుకోవడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

రవితేజ మొట్టమొదటిసారి ఇలా తన పేరును మార్చుకున్నాడు.ప్రెసెంట్ రవితేజ ఈ సినిమాతో పాటు ధమాకా సినిమా షూటింగ్ కూడా ఏకకాలంలో పూర్తి చేస్తున్నాడు.