Ravi Teja : రవితేజ ఫ్యామిలీ నుంచి హీరోగా వారసుడు ఎంట్రీ.. ఏ సినిమాతో అంటే?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీల వారసులు హీరో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల పిల్లలు, వారసులు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.ఇప్పటికీ ఒకరి తరువాత ఒకరు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా సినిమా ఇండస్ట్రీకి మరొక హీరో కూడా ఎంట్రీ ఇచ్చాడు.

ఆ యంగ్ హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) ఇంటి వారసుడు.

ఏంటి రవితేజ వారసుడు అంటే రవితేజ కొడుకు అనుకుంటున్నారా.మీరు పప్పులో కాలేసినట్లే.

ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న హీరో మాస్ మహారాజ రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్( Madhav ).

"""/" / మాధవ్ హీరోగా టాలీవుడ్ డెబ్యూ ఇవ్వనున్నారు.జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాణి సమర్పణలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ సినిమాకు పెళ్లి సందడి లేడీ డైరెక్టర్ గౌరీ రోణంకి( Director Gauri Ronanki ) దర్శకత్వం వహిస్తున్నారు.

రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభమైన ఈ సినిమా పూజా కార్యక్రమంలో తెలుగు సినీ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అలాగే సురేష్ బాబు, నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, నటుడు రఘు తదితరులు పాల్గొన్నారు.

ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించనున్నారు.ఇకపోతే హీరో రవితేజ తన ట్విట్టర్ ఖాతా ద్వారా హీరో మాధవ్ కి సంబంధించిన ఫోటో ని షేర్ చేస్తూ తెలిపారు.

"""/" / మా అందరి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి అని తెలిపారు రవితేజ.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అలాగే పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోలను చూసిన రవితేజ అభిమానులు ఈ రోజు మాధవ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే మాస్ మహారాజ రవితేజ విషయానికి వస్తే.ఇటీవల ధమాకా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ ఈ సినిమాతో సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాడు.

ప్రస్తుతం అదే ఊపుతో రావణాసుర సినిమాలో నటిస్తూ బిజీబిజీగా ఉన్నాడు.ఇప్పటికే రావణాసుర సినిమా నుంచి విడుదలైన పోస్టర్ సాంగ్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది అని తెలిసిందే.

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ వరుసగా సినిమాలలో నటిస్తూ సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు.

స్పిరిట్ లో స్టార్ హీరో ప్రభాస్ అలా కనిపించనున్నారా.. ఇదే జరిగితే అరాచకం!