Ravi Teja : ఆరు వరస ప్లాపుల తర్వాత రవితేజ కి హిట్ ఇచ్చిన ఈ సినిమా గురించి మీకు తెలుసా?

రవితేజ( Raviteja ) కెరియర్ డౌన్ ఫాల్ లో నడుస్తున్న సమయం అది.

దాదాపు ఒకదాని తర్వాత ఒకటి ఆరు వరుస ప్లాపులు వచ్చాయి.ఏ కథ తీసిన ఎలాంటి కథతో వచ్చినా కూడా విజయం అనేది రవితేజకు దగ్గరలో కూడా రావడం లేదు.

అవి మామూలు ప్లాపులు అంటే తక్కువే వాటిని డిజాస్టర్స్ అనాలి.దొంగల ముఠా, వీరా, నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు, సారోచ్చారు ఇవే ఆరు దారుణమైన పరాజయాలు.

ఈ సమయంలో రవితేజ పరిస్థితి దారుణంగా మారిపోయింది ఏ కథ ఎంచుకోవాలో తెలియని అయోమయంలో పడిపోయాడు చివరికి చిన్న సినిమా హీరోలు కూడా విజయాలు దక్కించుకుంటున్నారు.

కానీ రవితేజకు కాలం కలిసి రావడం లేదు. """/"/ ఈసారైనా రవితేజ హిట్టు కొట్టకపోతారా అని ఆయన అభిమానులతో పాటు సాధారణ సినిమా ప్రేక్షకులు కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఇక దారుణంలో దారుణం ఏంటి అంటే ఆ టైంలో రవితేజను కలవడానికి ఒక అభిమాన సంఘం వచ్చింది.

వస్తూ వస్తూ తమతో పాటే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదం( Vijayawada Kanakadurga ) కూడా తీసుకొచ్చారు.

ఆనవాయితీగా ఎప్పుడూ అభిమానులు కలిసిన ఆయనకు ప్రసాదం ఇస్తారు.ఈసారి తన అనుమానం ఏదో ఎలాగైనా ఎత్తుకొట్టాలని ప్రత్యేకంగా రవితేజ పేరు చేయించారట సంఘం సభ్యులు.

అన్న ఎలాగైనా ఒక హిట్టు కొట్టు అంటూ రవితేజతో చెప్పి ప్రసాదం చేతిలో పెట్టి వెళ్లిపోయారట.

"""/"/ సరిగ్గా అదే రోజు సాయంత్రం గోపీచంద్ మలినేని( Gopichand Malineni )దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.

గోపీచంద్ దర్శకత్వంలో రవితేజ అప్పటికే డాన్ శీను అనే హిట్ సినిమాలో నటించాడు.

గోపీచంద్ రవితేజ అని పిలవడం స్టోరీ చెప్పడం, అరగంటలో అది ఓకే అయిపోవడం, ఆ తర్వాత అన్ని చకచకా కుదిరిపోవడం, బలుపు( Balupu ) అనే పేరుతో ఆ సినిమా విడుదలై రవితేజకు అరడజన్ ఫ్లాపుల తర్వాత హిట్ రుచి చూపించడం జరిగిపోయాయి.

ఈ సినిమాలో శృతిహాసన్, అంజలి హీరోయిన్స్ గా నటించడంతో వారికి కూడా మంచి పేరు వచ్చింది.

బ్రహ్మానందం కామెడీ కూడా బాగా కలిసి వచ్చింది.కమెడియన్ ఏవీఎస్ కి ఇదే ఆఖరి చిత్రం కాగా అడవి శేష్ నెగటివ్ లో నటించిన సినిమా ఇదే.

ఈ సినిమా బెంగాలీలో రీమేక్ అయింది ప్రస్తుతం కన్నడ లో కూడా రీమేక్ చేయబడుతుంది.

అర్జున్ రెడ్డి కంటే ముందు సందీప్ పని చేసిన మూడు సినిమాలు.. ఏవంటే..??