రవితేజ జోరు మామూలుగా లేదుగా.. ఈసారి 'రావణాసుర'
TeluguStop.com
మాస్ మహారాజ రవితేజ నాలుగు అయిదు సంవత్సరాల క్రితం ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి.
ఆ సమయంలో మినిమం సక్సెస్ హీరో అంటూ రవితేజ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.
అలాంటి రవితేజ కాల క్రమేనా వరుస ప్లాప్ లు పడటంతో సినిమాల సంఖ్య తగ్గిస్తూ వచ్చాడు.
ఒకానొక సమయంలో రెండేళ్లకు ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేదు.మెల్ల మెల్లగా రవితేజ పుంజుకున్నాడు.
వరుసగా సినిమాలు చేస్తూ మళ్లీ పాత రవితేజను గుర్తుకు తీసుకు వస్తున్నాడు.పెద్ద ఎత్తున సినిమాలను ఎంపిక చేసుకుంటున్న రవితేజ ప్రస్తుతం అత్యధిక సినిమాలు చేస్తున్న టాప్ స్టార్ హీరోగా రికార్డు సాధించాడు.
ఆయన సినిమాల జాబిత అనూహ్యంగా పెరగడంతో అభిమానులు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.
సందర్బం ఏదైనా కూడా ఖచ్చితంగా రవితేజ సినిమా ప్రకటన వస్తూనే ఉంది.24 గంటల వ్యవధిలో రెండు సినిమాలను రవితేజ ప్రకటించాడు.
రవితేజ ఈ ఏడాది క్రాక్ సినిమాతో ఇప్పటికే వచ్చి సక్సెస్ ను దక్కించుకున్నాడు.
ఇదే ఏడాది డిసెంబర్ వరకు ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.
ఖిలాడి ముగిసిన వెంటనే రామారావు ఆన్ డ్యూటీ అంటూ సినిమాను చేస్తున్నాడు.ఆ సినిమా చిత్రీకరణ సగంకు పైగా పూర్తి అయ్యిందంటున్నారు.
ఇక త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందబోతున్న ధమాకా సినిమా చిత్రీకరణ ఈ ఏడాదిలోనే అది కూడా ఈ నెలలోనే చివర్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరో వైపు టైగర్ నాగేశ్వరరావు సినిమాను చేయబోతున్నాడు. """/"/
వంశీ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందబోతుంది.
టైగర్ నాగేశ్వరరావు అంటూ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే కొత్త సినిమా ను ప్రకటించాడు.
అది కూడా సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర.చాలా కాలంగా సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమా ను రవితేజ వాయిదా వేస్తూ వస్తున్నాడు.
ఎట్టకేలకు ఆ సినిమా కు సంబంధించిన ప్రకటన వచ్చేసింది.ఇంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్న రవితేజ ముందు ముందు మరిన్ని సినిమాలకు కమిట్ అవ్వడం ఖాయం అంటున్నారు.
వచ్చే ఏడాదిలో కనీసం మూడు నాలుగు సినిమాలను రవితేజ విడుదల చేస్తాడేమో చూడాలి.
నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!