'ధమాకా' ఇంకా మొదలు పెట్టలేదేం రవితేజ?

మాస్ మహా రాజా రవితేజ హీరో గా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా రూపొందిన చిత్రం ధమాకా.

ఈ సినిమా కు మాస్ చిత్రాల దర్శకుడు త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

డిసెంబర్ 23వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీ గా ఉన్నాయి.

రవితేజ గత చిత్రాలు ఫెయిల్యూర్ అయినప్పటికీ ఈ సినిమా ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం తో పాటు ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి నచ్చే విధంగా ఉంటుందని.

ఇది గతం లో వచ్చిన సూపర్ హిట్ సినిమా తరహా లో మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ని అందించబోతుందని చిత్రానికి వర్క్ చేసిన యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

"""/"/ ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది అభిమానుల్లో హడావుడి కనిపిస్తుంది.

కానీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు పబ్లిసిటీ కార్యక్రమాలు మొదలు పెట్టిన దాఖలాలు కనిపించడం లేదు అంటూ రవితేజ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రవితేజ గత చిత్రాలు సక్సెస్ కాలేదు అయినా కూడా ఈ సినిమా విషయం లో సీరియస్ గా ప్రమోషన్ చేయక పోవడం ను ఆయన అభిమానులు తప్పుపడుతున్నారు.

ఈ మధ్య కాలం లో సినిమా లు చేయడం కంటే వాటిని ప్రమోట్ చేయడం లోనే ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

కానీ రవితేజ అలా పెట్టక పోవడం వల్లే ఆయన గత చిత్రాలు ఫెయిల్ అయ్యాయని.

కనీసం ఈ సినిమా కి అయినా ఎక్కువ శ్రద్ధ పెట్టాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సినిమా విడుదలకు మరో రెండు వారాల సమయం ఉండగా రవితేజ ప్రమోషన్ కార్యక్రమాలకు బరిలో దిగే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

వైరల్: దీనినే అతితెలివి అంటారు… పాక్ కుర్రాళ్ళ నిర్వాకం చూడండి?