Ravi Teja : కష్టపడ్డాను అంటూ సొల్లు చెప్పుకోవద్దు, ఎవరి కోసం కష్టపడుతున్నావ్ : రవితేజ
TeluguStop.com
రవితేజ.( Ravi Teja ) ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఈరోజు టాలీవుడ్ లోనే స్టార్ హీరోలలో ఒకడిగా కొనసాగేంత వరకు కూడా ఒంటరిగానే ఎదిగాడు.
ఈ స్థాయికి రావడానికి అతడు పడని కష్టాలు లేవు.చిన్నతనం నుంచి సినిమాలోకి రావాలనే కోరిక బలంగా ఉండేది.
కానీ తండ్రి ఉద్యోగం ఎక్కువగా నార్త్ లో ఉండాల్సిన అవసరం వచ్చేది.ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనే చదువుకోవాలని ఫిక్స్ అయ్యి డిగ్రీలో చేరాడు.
అప్పటి నుంచి మళ్లీ ఇక ఇండస్ట్రీని వదిలిపెట్టే అవకాశం రాలేదు.చదువులు ఇక్కడే పూర్తి చేసుకున్న తర్వాత సినిమాల్లో నటించాలని కోరికతో ఇక్కడే ఉండిపోయాడు.
అలా ఎవరి సహాయం లేకుండా ఆఖరికి కుటుంబం కూడా పక్కన లేకపోవడంతో ఒక్కడే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
"""/" /
మొత్తానికి సింధూరం సినిమాతో( Sindhooram Movie ) కాస్త గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత లీడ్ హీరోగా అవకాశాలు దక్కించుకొని ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ మాస్ మహారాజగా( Mass Maharaja ) ప్రస్తుతం గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ లోనే గొప్ప హీరోగా వెలుగుతున్నాడు.
అయితే ఇలా ఇంతటి కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టే తన కష్టాన్ని మాత్రం ఎక్కడా చెప్పుకోవడానికి ఇష్టపడడు.
పైగా ఎవరైనా కష్టపడుతున్నాను అని చెబితే అస్సలు ఒప్పుకోడు.ఎవరికోసం కష్టపడుతున్నారు.
వారు కష్టపడి దేశానికి ఏమైనా స్వాతంత్రం తెస్తున్నారా ? హీరో అవడానికి ఇండస్ట్రీకి వచ్చి కష్టాలు పడితే అది ఎవరికి గొప్ప చేసినట్లు కాదు.
ఎవరి కోసం వారు కష్టపడుతున్నారు. """/" /
ఎవరి స్వార్థం వారిది.
గొప్ప హీరో అయిపోవాలి లేదా గొప్ప నటుడవ్వాలనేది కలగా పెట్టుకుని కష్టపడ్డ వారెవరు దేశం కోసం ఉద్ధరించిన వారు కాదు కదా.
అందుకే బ్యాక్ గ్రౌండ్ ఉన్న లేకపోయినా కష్టపడాల్సిందే.ఆ కష్టాన్ని ఎప్పుడూ కూడా చెప్పుకోకూడదు.
కష్టాన్ని ఆసరాగా చూపించి అవకాశాన్ని అడగకూడదు.అవకాశం వచ్చి నిలబడ్డ తర్వాతే తాను పడ్డ కష్టాలను చెప్పుకుంటే బాగుంటుంది అంటూ రవితేజ చెప్తూ ఉన్నాడు.
ఏది ఏమైనా కష్టం విలువ తెలిసిన వాడు కాబట్టి ఇప్పటికీ తన చిన్ననాటి నుంచి జరిగిన ఏ కష్టాన్ని కూడా ఎవరికి షేర్ చేయడం రవితేజ.
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు…