Ravi Krishna Virupaksha : విరూపాక్ష హిట్టు..ఇక రవికృష్ణ కెరీర్ సెట్టు
TeluguStop.com
మన చిన్న వయసులో ఉన్నప్పుడు మొగిలి రేకులు అనే ఒక సీరియల్ వచ్చేది.
ఆ సీరియల్ లో నటించిన వారు చాల మంది ఇప్పుడు కెరీర్ ముగిసిపోయి ఎక్కడెక్కడో ఉన్నారు.
కానీ ఒక పాత్ర మాత్రం ఇప్పటికి అలాగే మన ముందు ప్రతి సీరియల్ లో కనిపిస్తూ ఉన్నాడు.
అతడు మరెవరో కాదు.బుల్లి తెర స్టార్ హీరో రవి కృష్ణ( Ravi Krishna ).
మొగిలి రేకులు మంచి విజయం సాధించడం తో అతడికి అనేక సీరియల్స్ లో నటించే అవకాశం లభించింది.
ఏళ్లకు ఏళ్ళు సాగదీసి ఎన్నో సీరియల్స్ లో నటించిన రాని గుర్తింపు మాత్రం అతడికి మొట్ట మొదటి సారి బిగ్ బాస్ రూపం లో వచ్చింది.
"""/" /
ఆ షో లో పాల్గొన్న తర్వాత చాల మంది అతడిని గుర్తు పట్టడం మొదలు పెట్టారు.
మంచి అబ్బాయి అనే పేరు తో బిగ్ బాస్ షో( Big Boss ) నుంచి బయటకు వచ్చి మళ్లి అవే రొటీన్ సీరియల్స్ లో నటించడం ఇష్టం లేక కొన్ని రియాలిటీ షో లలో పండగ స్పెషల్ ఎపిసోడ్స్ లో కనిపిస్తూ వస్తున్నాడు.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అడపా దడపా మాత్రమే కనిపిస్తున్న అది కూడా మూడేళ్ళ సమయం దాటిపోయింది.
ఇక అందరు రవి కృష్ణ పని అయిపోయినట్టే అనుకున్నారు. """/" / కానీ అతడి ఇన్నేళ్ల కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దక్కింది.
అది కూడా విరూపాక్ష సినిమా రూపం లో.విరూపాక్ష సినిమా లో రవి కృష్ణ కు చక్కని పాత్ర దొరికింది.
అతడు కనిపించిన సన్నివేశాల్లో గుండె జారిపోయినంత పని అయ్యింది.ముఖ్యంగా రైల్వే స్టేషన్ సీన్స్ లో అయితే నిజంగా అందరిని బయపెట్టేసాడు.
"""/" /
ఈ చిత్రం మంచి విజయం సాధించడం తో హీరో మరియు హీరోయిన్స్ తర్వాత మంచి పేరు దక్కించుకున్న పాత్రగా రవి పాత్ర వుంది.
ఇక ఈ చిత్రం థియేటర్స్ లో మంచి వసూళ్లను సాదిస్తుండటం తో ప్రస్తుతం చాల మంది నిర్మాతలు రవి కృష్ణ డేట్స్ కోసం అడుగుతున్నారట.
ఇలా ఒక్క పాత్ర అతడి జీవితాన్ని మంచి టర్న్ తీసుకునేలా చేసింది.ఏ నటుడికి అయినా కావాల్సింది ఇలాంటి ఒక పాత్ర మాత్రమే కదా.
అది వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుంది.రవి కెరీర్ కూడా విరూపాక్ష( Virupaksha ) తర్వాత మరొక రేంజ్ లో ఉండాలని కోరుకుందాం.
ఇదేందయ్యా ఇది…అల్లు అర్జున్ పార్టీ పెట్టి సీఎం అవుతారా.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు!