గంట సేపు రోప్స్ కట్టి వేలాడదీసి ఫోటోలు.. చివరికి పూర్ణ పరిస్థితి !

హీరోయిన్ పూర్ణ.మూడు సార్లు రవి బాబు సినిమాలో నటించింది కాబట్టి వారిద్దరికి జత కట్టి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

అందులో నిజమెంత అనే సంగతి పక్కన పెడితే ఆమె రవి బాబు హీరోయిన్ గానే పాపులర్ అయ్యింది.

అయితే తాను కొన్ని కారణాల వలన భవిష్యత్తులో రవి బాబు సినిమాల్లో నటించను అంటూ ఆమె ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది.

ఇక పోతే ఆ మధ్య కాలంలో రవి బాబు అలీ తో సరదాగా షో లో పాల్గొని నటి పూర్ణ గురించి కొన్ని విషయాలను తెలిపాడు.

పూర్ణ తో వరస సినిమాల్లో చేసిన మాట వాస్తవమే కానీ ఆమె బాగా నటిస్తుంది అన్న కారణంతో తప్ప మరొకటి ఏది లేదు అంటూ రవి బాబు చెప్పుకోచ్చారు.

బడ్జెట్ లో ఉండి, చక్కగా నటిస్తే ఏ హీరోయిన్ తో అయినా ఒకటికి మించి సినిమాలు చేయడానికి ఆసక్తి ఉంటుంది.

అందులో ఎలాంటి తప్పు లేదు.ఇక పూర్ణ తో సినిమా షూటింగ్ లో ఒక సంఘటన కూడా రవి బాబు షేర్ చేసుకున్నాడు.

"""/" / అవును సినిమా షూటింగ్ కోసం పూర్ణ పాల్గొంది.ఆమె ఒక ఏనుగు చేతిలో ఇరుక్కున్నట్టు ఒక ఫోటో షూట్ ప్లాన్ చేశారట రవి బాబు.

అందుకోసం ఆమెను రోప్స్ కట్టి పైకి వేలాడదీశారట.ఆలా ఒక గంట పాటు ఉంచి కావలసిన అన్ని షాట్స్ తీయించారట.

ఆ షాట్స్ అన్ని కూడా సిస్టం లో పెట్టడానికి చూస్తే కెమెరా లో చిప్ పెట్టలేదు అనే విషయం అప్పుడు గుర్తచ్చిందట.

ఆ విషయం ఎలా చెప్పాలో తెలియక ఫోటో గ్రాఫర్ మెల్లిగా రవి బాబు కి చెప్పేశాడట.

"""/" / దాంతో పూర్ణ కి విషయం చెప్పడం తో ఆమె కోపం నషాళానికి ఎక్కిందట.

మళ్లి రోప్ కట్టి గంటకు పైగా పది అడుగుల ఎత్తులో షూట్ చేశారట.

ఇలా ఒక చిన్న పొరపాటు వలన పూర్ణ గోరంగా బుక్ అయ్యింది.ఆ తర్వాత కూడా రవి విషయంలో మరియు అతడి సినిమాల విషయంలో పూర్ణ చాల అసౌకర్యంగా ఫీల్ అవ్వడం తో అతనితో మళ్లి సినిమా చేయకూడదు అని ఫిక్స్ అయ్యిందట.

ఇప్పుడు పెళ్లి చేసుకొని దుబాయ్ లో ఎంజాయ్ చేశున్న పూర్ణ అతి త్వరలో రియాలిటీ షోలకు తిరిగి వస్తుంది.

మంచు వారింట మొదలైన చక్కెర లొల్లి… చంపడానికే కుట్ర… మనోజ్ సంచలన వ్యాఖ్యలు!