బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం..!

బెంగళూరులోని( Bengaluru ) ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ( Rave Party ) తీవ్ర కలకలం సృష్టించింది.

బర్త్ డే వేడుకల పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారని తెలుస్తోంది.

ఓ ఫామ్ హౌస్ లో( Farm House ) జరిగిన ఈ పార్టీలో భారీగా డ్రగ్స్, కోకైన్ వినియోగించినట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలోనే ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తి పేరుపై ఉన్నట్లు నిర్ధారించారు.

అదేవిధంగా రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి( Tollywood ) చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.

పార్టీకి హాజరైన వారిలో తెలుగు వారే అధికంగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.ఈ క్రమంలోనే రేవ్ పార్టీ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

తెలుగు వారిగా పుట్టి తప్పు చేశామా అని అనిపించే నటీనటులు వీరే !