రావణాసురుడు చనిపోలేదు… ఇంకా బ్రతికే ఉన్నాడంట…

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించడంతో పలు ధారావాహికల షూటింగ్ పనులు ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో ఛానల్ నిర్వాహకులు ధారావాహికలకు సంబంధించిన పాత ఎపిసోడ్లనే మళ్లీ పునః ప్రసారం చేస్తున్నారు.

ఇందులో భాగంగా దూరదర్శన్ చానల్ లో రామాయణ్ సీరియల్ మళ్లీ ప్రసారం చేస్తున్నారు.

అయితే ఈ సీరియల్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.తాజాగా ఈ సీరియల్ లో రావణాసురుడి పాత్రలో నటించినటువంటి అరవింద్ త్రివేది గురించి ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

రామాయణ్ ధారావాహికలో రావణాసురుడు పాత్రలో నటించిన అరవింద్ త్రివేది గత కొద్ది కాలం క్రిందట మరణించాడని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను చేస్తున్నారు.

దీంతో ఈ విషయంపై అరవింద్ త్రివేది కుటుంబ సభ్యులు స్పందించారు.ఇందులో భాగంగా అరవింద్ త్రివేది ఇంకా బ్రతికే ఉన్నారని, అలాగే అయన చనిపోయినట్టు వస్తున్నటువంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని స్పష్టం చేశారు.

దీంతో అరవింద్ త్రివేది అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.అంతేగాక రామాయణం సీరియల్ లో అరవింద్ త్రివేది రావణాసురుడి పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని, ఆ పాత్రకి అరవింద్ త్రివేది నూటికి నూరుశాతం న్యాయం చేశాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం షూటింగులు లేకపోవడంతో మళ్లీ ప్రసారం అవుతున్న "రామాయణ్" ధారావాహికకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

అంతేకాక ఇప్పటికే టిఆర్పి రేటింగులు పరంగా కూడా ఈ ధారావాహిక దూసుకుపోతోంది.అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా ఇప్పుడప్పుడే షూటింగుల పనులు మొదలయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు.

దీంతో మరింత కాలం పాటు రామాయణం ధారావాహికను ప్రసారం చేయాలని దూరదర్శన్ చానల్ నిర్వాహకులు యోచన చేస్తున్నట్లు సమాచారం.

మే 5న తెలంగాణకు రాహుల్ గాంధీ.. !