ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. మార్చురీలో రైతు మృతదేహాన్ని కొరుక్కుతిన్న ఎలుకలు.. ?

లోకంలో మనిషి బ్రతికి ఉండగానే విలువ లేదు.ఇక మరణించాక ఎవరు విలువ ఇస్తారు.

అందుకే శవం అంటారు.ఎప్పుడెప్పుడు దహనసంస్కారాలు నిర్వహించాలా అని చూస్తారు.

కొద్దిగా లేటైతే వెంటనే ఆ శవాన్ని దహనం చేయండని బందువులే అంటారు.ఇదే మనిషికి ఉన్న విలువ.

ఇకపోతే ప్రభుత్వ ఆస్పత్రులు దేశంలో ఎక్కడైనా ఒకే విధంగా పనిచేస్తాయని నిరూపించిన ఘటన.

హర్యానాలో జరిగిన దారుణం.వివరాల్లోకి వెళ్తే.

హర్యానా, సోనిపట్ జిల్లాలో, బైయన్పూర్ గ్రామానికి చెందిన 72ఏళ్ల రాజేందర్ అనే రైతు బుధవారం గుండెపోటుతో మరణించడంతో, ఆయన మృతదేహాన్ని సోనిపట్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచారట.

మరుసటి రోజు ఇతని మృతదేహం కోసం వచ్చిన కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని పలుచోట్ల ఎలుకలు కొరికినట్లు గుర్తించారట.

ఈ విషయాన్ని సోనిపట్ ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ జై భగవాన్ దృష్టికి తీసుకెళ్లగా, ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరని గుర్తించడానికి ముగ్గురు వైద్య అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారట.

ఇకపోతే మరణించిన రైతు శరీరాన్ని ఎలుకలు కొరుకుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

కూటమికి చిరు మద్దతు తెలపడానికి అదే కారణం.. పిఠాపురంలో పవన్ గెలుపు కష్టం: చిట్టిబాబు