బీసీ గురుకులంలో విద్యార్థులపై ఎలుకల దాడి

నల్లగొండ జిల్లా: దేవరకొండ మండలం కొండభీమనపల్లి బీసీ గురుకుల పాఠశాలలో గత సోమవారం నిద్రిస్తున్న విద్యార్థులపై ఎలుకలు దాడి చేసిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.సోమవారం రాత్రి విద్యార్థులు నిర్దిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎలుకలు దాడి చేసి 13 మందిని గాయపర్చినట్లు తెలుస్తోంది.

దీనితో అప్రమత్తమైన ఉపాధ్యాయులు తూర్పుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యార్థులకు చికిత్స చేయించి, విషయాన్ని బయటకు పొక్కకుండా పాఠశాల యాజమాన్యం గోప్యంగా ఉంచడంతో రెండు రోజుల తర్వాత పేరెంట్స్ కు తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బీసీ గురుకుల పాఠశాల అపరిశుభ్రంగా ఉండడంతోనే ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని,ఎలుకల కోసం పాములు కూడా వచ్చే అవకాశం ఉంటుందని,చదువు కోసం మా పిల్లలను పంపిస్తే ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈఘటనపై తెలుసుకునేందుకు పాఠశాల ప్రిన్సిపాల్ కు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికైనా గురుకులంలో ఏం జరిగిందో విచారణ జరిపి, పాఠశాలలో అన్నిరకాల వసతులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని,ఈ పరిస్థితికి కారణమైన పాఠశాల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. జార్జియాలో బస్సు యాత్ర ప్రారంభించిన హారిస్- వాల్జ్