రత్న కుమారిగా అడుగుపెట్టింది.. ఏకంగా స్టార్ హీరోయిన్ అయ్యింది!

తెలుగు సినీ ఇండస్ట్రీకి రత్నకుమారి అడుగుపెట్టిన నటి వాణిశ్రీ.వాణిశ్రీ ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ నిలిచింది.

తెలుగు సినిమాలతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది.తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

శ్రీదేవి, జయప్రద వంటి స్టార్ హీరోయిన్స్ ఇండస్ట్రీలో అడుగు పెట్టేంతవరకు వాణిశ్రీ స్టార్ హీరోయిన్ గానే ఉంది.

ఇక వయసు మీద పడ్డాక తల్లి, అత్త వంటి సహాయ పాత్రలలో బాగా మెప్పించింది.

ఇక ఈమె 1962లో తొలిసారిగా తెలుగు సినీ చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది.

వాణిశ్రీ ఇండస్ట్రీలో మొదట కామెడీ క్యారెక్టర్ తో అడుగుపెట్టింది.ఎక్కువగా హాస్యనటుడు పద్మనాభం, రాజనాల వంటి సరసన నటించింది.

ఈమెను మొదట రత్నకుమారి అనే పేరుతో పిలిచేవారు.సోమవార వ్రత మహత్యం షూటింగ్ సమయంలో సినీ హీరో కాంతారావు, విలన్ పాత్ర స్పెషలిస్ట్ రాజనాల కలిసి అలెగ్జాండర్ నాటకంలో వాణిశ్రీ ని నటించడానికి తనకు మేకప్ వేయించి తీసుకెళ్లగా కొన్ని సన్నివేశాల తరువాత కృష్ణ స్వామి, నాగరాజ రావు వాణిశ్రీ సినిమాలకు పనికిరాదని ముఖం మీద తేల్చి చెప్పేశారు.

"""/"/ అలా కొన్ని రోజుల తర్వాత రణభేరి సినిమాలో వాణిశ్రీకి హీరోయిన్ గా అవకాశం ఇవ్వగా అందులో వ్యాంప్ క్యారెక్టర్ రాణిస్తేనే సినిమా రాణిస్తుందని వాణిశ్రీ కి వ్యాంప్ క్యారెక్టర్ ఇప్పించారు కాంతారావు.

ఇక ఈ సినిమా విడుదలైన ఇంకా వాణిశ్రీకి మంచి గుర్తింపు పొందింది.అలా కొన్ని సినిమాలలో వ్యాంప్ పాత్రల్లో నటించగా ఆ తర్వాత దేవుని గెలిచిన మానవుడు సినిమాలో హీరోయిన్ గా నిలిచింది.

ఇక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి మహానటి సావిత్రి తర్వాత మొదటి స్థానంలో తానే ఉంది.

అంతేకాకుండా అందం విషయంలో కూడా ఆమె బొట్టు, కట్టు ఎంతో మందిని ఆకట్టుకుంది.

అలా ఈతరం సినిమాల వరకు తన అందంలో ఎలాంటి మార్పులు కనిపించలేదు.

అందానికి ఐస్ క్యూబ్స్.. ఇలా తయారు చేసుకుని వాడితే అదిరిపోయే బెనిఫిట్స్!