కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల కు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్:జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా:రాబోయే అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్( N Khemya Naik ) తెలిపారు.

శుక్రవారం ఐ డి ఓ సి లో జిల్లాలో లొకేషన్ లు, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ , రెండవ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం, ఓటు హక్కు వినియోగించు కునే విధానంపై చేపడుతున్న అవగాహన, చైతన్య కార్యక్రమాల పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఒక పోలింగ్ కేంద్రంలో 1350 కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే కొత్త పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు.

జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం పరిధిలో 141 లొకేషన్ లు, 255 పోలింగ్ కేంద్రాల ఉండగా అదనంగా 5 పోలింగ్ కేంద్రాలను, సిరిసిల్ల నియోజకవర్గం ( Sirisilla Constituency ) పరిధిలో 147 లొకేషన్ లు, 282 పోలింగ్ కేంద్రాల ఉండగా అదనంగా 5 పోలింగ్ కేంద్రాలను ఓటర్ల సంఖ్య ఆధారంగా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.

ఇందు కోసం కేంద్ర ఎన్నికల సంఘం కు రేషనైజేషన్ ప్రపోజల్ పంపాల్సి ఉంటుందన్నారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై ఓటర్లకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున రెండు ప్రచార రథాలను జిల్లాలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అలాగే ఐ డి ఓ సి తో పాటు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కార్యాలయంలో కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికల కమిషన్ నిబంధనలననుసరించి అన్ని పనులు పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.రెండవ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం ద్వారా ఫామ్ 6,7, 8 దరఖాస్తుల ద్వారా కొత్త ఓటరు నమోదు, తొలగింపులు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, పి మధు సూధన్,కలెక్టరెట్ పరిపాలన అధికారి విజయ్ కుమార్, ఎన్నికల విభాగం నాయబ్ తహశీల్దార్ పాషా, సీనియర్ అసిస్టెంట్ అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ సినిమా ఆగిపోయిందా..? క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్…