సూర్యాపేట జిల్లా:పేద ప్రజల ఆహార భద్రత కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెతతుతున్నాయి.
పేదల ఆహారం కోసం అందించే రేషన్ బియ్యం అక్రమార్కులకు వ్యాపార వస్తువుగా మారి కాసులు కురిపిస్తూ ఉండడంతో మండలంలో ఈ దందా యధేచ్చగా సాగుతుందని మండల ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని ప్రజలు ఎక్కువ మంది తినడం లేదనేది అందరికీ తెలిసిందే.
దీనితో ఒక అంచనా ప్రకారం లబ్ధిదారుల్లో 70 శాతం మంది రేషన్ బియ్యం తినడం ఎప్పుడో మానేశారు.
ప్రభుత్వం అందించే బియ్యం వద్దనడం ఎందుకని ప్రతి నెల రేషన్ షాప్ కు వెళ్లి రేషన్ తీసుకుంటున్నారు.
దానితో లబ్ధిదారుల వద్ద రేషన్ బియ్యం పేరుకుపోతున్నాయి.అదే అక్రమార్కులకు వరంగా మారిందని టాక్.
ఇంట్లో పేరుకుపోయిన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు కొనుగోలుదారులకు కిలోకి ఐదు నుంచి పది రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారు.
మండలంలోని వివిధ గ్రామాల్లో తెల్లవారింది మొదలు రేషన్ బియ్యం ఉన్నాయా.మేము కొంటాం అంటూ ఒక ఆడ,ఒక మగ మనిషి ఇద్దరు ప్రత్యక్షమై గ్రామంలోని ప్రతి ఇల్లు తిరుగుతూ బియ్యం సేకరిస్తున్నారని,ఉదయం సేకరించిన బియ్యాన్ని ఒక ఇంట్లో పెట్టి చీకటి పడిన తర్వాత ద్విచక్ర వాహనంపై వారి ప్రాంతానికి తరలిస్తారు.
అలా వివిధ గ్రామాల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని తమ గ్రామంలో నిలువ చేసి, అదును చూసి రైస్ మిల్లుకు తరలించి కిలో రూ.
25 నుండి రూ.40 అమ్ముకుంటున్నారని సమాచారం.
అక్రమంగా కొన్న బియ్యాన్ని రైస్ మిల్లర్లు పక్క రాష్ట్రాలకు తరలించి క్యాష్ చేసుకుంటున్నారు.
ఇప్పటికైనా అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి,రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి,ఈదందాకు చరమగీతం పాడాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఆ బ్యానర్ లో పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతి మూవీ.. ఛార్మీ వార్తల్లో నిజం లేనట్టేగా!