రీ రిలీజ్ కానున్న బోల్డ్ మూవీ రతినిర్వేదం.. డబ్బుల కోసం మరీ ఇంతలా దిగజారాలా అంటూ?

ఈ మధ్య కాలంలో తెలుగుతో పాటు ఇతర భాషల్లో గతంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలను రీ రిలీజ్ చేయడం జరుగుతోంది.

పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల హిట్ సినిమాలు సైతం రీ రిలీజ్ అవుతూ నిర్మాతలకు లాభాలను అందిస్తున్నాయి.

అయితే కొంతమంది నిర్మాతలు ఏ మాత్రం క్రేజ్ లేని సినిమాలను రీ రిలీజ్ చేస్తుండగా మరీ ఘోరం ఏంటంటే బోల్డ్ సినిమాలు( Bold Movies ) సైతం రీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.

"""/" / బోల్డ్ మూవీ రతినిర్వేదం( Ratinirvedam ) రీ రిలీజ్ దిశగా అడుగులు పడుతుండగా ఎక్కువమంది విమర్శలు చేస్తున్నారు.

ఇలాంటి సినిమాలను రీ రిలీజ్ చేయడం ద్వారా లాభం ఏంటని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

7జీ బృందావన కాలనీ( 7G Brindavan Colony ) సినిమాను రీ రిలీజ్ చేసినా మంచి రెస్పాన్స్ రావడంతో రతినిర్వేదం రీ రిలీజ్ దిశగా అడుగులు పడ్డాయని సమాచారం అందుతోంది.

రతినిర్వేదం సినిమాలో శ్వేతామీనన్ లీడ్ రోల్ లో నటించారు. """/" / ఇలాంటి బీ గ్రేడ్ సినిమాలను రీ రిలీజ్ చేయకుండా ఉంటే మంచిదని రీ రిలీజ్ చేసినా ప్రేక్షకులు ఆదరించకుండా ఉంటే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమా నిర్మాతలు .డబ్బుల కోసం మరీ ఇంతలా దిగజారాలా అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ తరహా సినిమాల రీ రిలీజ్ విషయంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకుంటే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీ పరువు తీసేలా ఇలాంటి చెత్త సినిమాలను రీ రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా రీ రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

రతినిర్వేదం సినిమా రీ రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.

హీరో విశాల్ కి ఏమైంది… ఫుల్ క్లారిటీ ఇచ్చిన నటి కుష్బూ!