టాప్5 లో ఉండే అర్హత నాకు లేదు.. నన్ను క్షమించండి.. రతిక సంచలన వ్యాఖ్యలు!

బిగ్ బాస్ హౌస్ నుంచి తాజాగా రతికా రోజ్( Rathika Rose ) ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చి ఎలిమినేట్ అయిన ఈ కంటెస్టెంట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నేను గేమ్స్ లో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఆడియన్స్ సపోర్ట్ చేస్తూ వచ్చారని రతిక కామెంట్లు చేశారు.

యాక్టివిటీల పరంగా నేను వీక్ అని ఆమె తెలిపారు.సెకండ్ టైమ్ ఛాన్స్ వచ్చినా సరిగ్గా వినియోగించుకోలేక పోయానని ఆమె అన్నారు.

ఈ విషయాన్ని అంగీకరిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.ఫస్ట్ టైమ్ ఎలిమినేట్ అయినసమయంలో శివాజీ, ప్రశాంత్ లను కనీసం చూడకుండా రావడానికి కారణం ఉందని రతిక కామెంట్లు చేశారు.

నేను ఎలిమినేట్ అయ్యాననే ప్రకటన వినగానే మైండ్ బ్లాంక్ అయిందని ఆమె అన్నారు.

బయటకు వచ్చాక కొన్ని విషయాలు తెలిసి వాళ్లకు సారీ చెప్పానని రతిక వెల్లడించారు.

"""/" / నేను కన్నింగ్ స్టార్ అని కొంతమంది కామెంట్లు చేశారని రెండోసారి హౌస్ లోకి వెళ్లిన సమయంలో అది పోగొట్టుకున్నానని అనుకుంటున్నానని రతిక పేర్కొన్నారు.

మొదటిసారి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన సమయంలో నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారని అర్థమైందని వైల్డ్ కార్డ్ లో వచ్చిన వాళ్లకు నా గురించి ఎందుకు అని రతిక పేర్కొన్నారు.

రెండోసారి వెళ్లిన సమయంలో మరింత డౌన్ అయ్యాయని ఆమె అన్నారు. """/" / నేను అందరితో బాగున్నానని ఏ బ్యాచ్ తో కలవలేదని ప్రశాంత్ విషయంలో తప్పులను అంగీకరిస్తారని రతిక తెలిపారు.

బిగ్ బాస్ టాప్5 లో ఉండే అర్హత నాకు లేదని అందుకు నన్ను క్షమించాలని టాప్3 లో ఒకరిగా శివాజీ అన్నను చూడాలని అనుకుంటున్నానని రతిక తెలిపారు.

రతిక చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

హిందూ మతాన్ని నమ్మడం వేరు.. వాడుకోవడం వేరు..పూనమ్ పోస్ట్ ఎవరి గురించి?