ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి రతికా అవుట్..తేజా ని కావాలనే సేఫ్ చేసారా?

ఎన్నో భారీ అంచనాల నడుమ ప్రారంభం అయిన బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss Season ) మొదటి ఎపిసోడ్ నుండే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోయింది.

ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్, వాళ్ళు ఆడుతున్న టాస్కులు ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేసింది.

అందుకే టీఆర్ఫీ రేటింగ్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చాయి.మునుపెన్నడూ లేని విధమైన రేటింగ్స్ మొత్తం ఈ సీజన్ కి మాత్రమే వచ్చింది.

ఇప్పటికీ మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ లో షో లో ఇప్పటి వరకు కిరణ్ , షకీలా మరియు దామిని ఎలిమినేట్ అయ్యారు.

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి రతికా, తేజా, యావర్, శుభ శ్రీ , ప్రియాంక మరియు గౌతమ్ నామినేట్ అయ్యారు.

ఈ నామినేషన్స్ చాలా హీట్ వాతావరణం లో జరిగింది. """/" / ఈ నామినేషన్స్ లో అందరి కంటే అత్యధిక ఓట్ల శాతం తో యావర్ మొదటి స్థానం లో నిల్చినట్టు తెలుస్తుంది.

ఇక చివరి రెండు స్థానాల్లో మాత్రం తేజా మరియు రతికా ఉన్నారు.స్వల్ప ఓట్లా తేడా తో రతికా తేజ కంటే తక్కువ ఓట్లను దక్కించుకుంది.

ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఈమెనే.ఈమె మొదటి వారం లో ఆడిన ఆట తీరు చూసి, కచ్చితంగా ఈ అమ్మాయి టాప్ 5 లో ఉంటుంది అని అనుకున్నారు అందరూ.

ఒక రూమ్ లోకి ఆమెని పిలిచి, మూడు గంటలసేపు 'ఉడతా ఉడతా ఊచ్' పాటని వేసి, ఎన్ని సార్లు ఉడతలు వచ్చాయో చెప్పమని బిగ్ బాస్ అడగగా, చాలా సింపుల్ గా చెప్పేస్తాది.

అప్పుడు ఆమె తెలివిని చూసి నాగార్జున( Nagarjuna ) సైతం ఆశ్చర్యపోయి చప్పట్లు కొడుతాడు.

కానీ ఆమె గ్రాఫ్ ఆ తర్వాత పెరగాల్సింది పోయి, వారం వారం తగ్గుతూ వచ్చింది.

"""/" / ఆమెకి ఉన్న తెలివితేటలూ టాస్కులు ఆడడం లో పెట్టడం మానేసి, ఎంతసేపు గొడవలు పెట్టుకోవడం కోసం, ప్రశాంత్ , యావర్ వంటి కంటెస్టెంట్స్ ని తన ముగ్గులోకి దింపి వాళ్ళ గేమ్ ని డిస్టర్బ్ చెయ్యడం, ఇలా కన్నింగ్ వేషాలు వెయ్యడానికే ఆమె తన తెలివిని మొత్తం ఉపయోగించింది.

ఈమె వల్ల అందరి ఆటలు కూడా డిస్టర్బ్ అవుతున్నాయి, అందుకే ఈమెని ప్రేక్షకులు ఇంటికి పంపేశారు అని అంటున్నారు విశ్లేషకులు.

ఈ వారం అందరూ తేజా ఎలిమినేట్ అవుతాడేమో అని అనుకున్నారు, కానీ అతను సేఫ్ అయ్యాడు, రతికా ఎలిమినేట్ అయ్యింది.

ఈ వారం తేజా వేసిన వేషాలకు, కచ్చితంగా సోమవారం నామినేట్ అవుతాడు.తదుపరి వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళేది ఇతనే అని సోషల్ మీడియా( Social Media ) లో చర్చలు నడుస్తున్నాయి.

ఆట మొదలెట్టిన డొనాల్డ్ ట్రంప్ .. 7.25 లక్షల మంది భారతీయులు ఇంటికే?