ఈ ఏడాది రథసప్తమి ఎప్పుడు.. రథసప్తమి ప్రాముఖ్యత ఏమిటి?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి నెలా ఏదో ఒక ప్రత్యేకమైన పర్వదినం లేదా విశిష్టమైన రోజు వస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే వచ్చే అమావాస్య తర్వాత మాగమాసం నెల ప్రారంభం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు పూజ కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఈ క్రమంలోని మాఘమాసంలో సూర్యుడుకి ఎంతో పవిత్రమైన రథసప్తమి వస్తుంది.సప్తమి రోజు సూర్యుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి పూజిస్తారు.

అయితే ఈ ఏడాది సప్తమి ఎప్పుడు వచ్చింది రథసప్తమి చేయడానికి అనువైన సమయం ఏంటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ప్రతి ఏడాది రథసప్తమి మాఘమాసం నెల శుక్లపక్షం ఏడవ రోజు వస్తుంది.ఇలా ఏడవరోజున రథసప్తమిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

రథసప్తమి రోజు సూర్యుడిని ప్రత్యేకంగా పూజించి నమస్కరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

రథసప్తమి రోజు పూజ చేసే విధానం, దానధర్మాలు రెట్టింపు ఫలితాలను అందిస్తాయని పండితులు చెబుతున్నారు.

ఇక ఈ పర్వదినం ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీ వచ్చింది.సూర్యుడికి ఎంతో పవిత్రమైన ఈ దినాన్ని రథసప్తమి, ఆరోగ్య సప్తమి, అచల సప్తమి, సూర్య సప్తమి అనే పేర్లతో కూడా పిలుస్తారు.

"""/"/ ఎంతో పవిత్రమైన ఈ రోజు ఉదయమే నిద్రలేచి గంగాజలంతో స్నానం చేసి సూర్యుడికి ఉపవాసంతో పూజ చేయటం వల్ల ఆ సూర్యుని అనుగ్రహం ఎల్లవేళలా మీపై ఉండి ఆయురారోగ్యాలనూ ప్రసాదిస్తారని.

రథసప్తమి పూజ చేయడానికి సరైన సమయం ఏంటి అనే విషయానికి వస్తే.ఫిబ్రవరి 7 సోమవారం సాయంత్రం 4:37కి సప్తమి తిథి సప్తమి తిథి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 8 మంగళవారం, ఉదయం 6:15కి ముగుస్తుంది.

రథసప్తమి నాడు స్నాన ముహూర్తం: ఫిబ్రవరి 7, ఉదయం 5:24 నుండి 7:09 వరకు ఎంతో అనువైన సమయం అని పండితులు చెబుతున్నారు.

పవన్ ప్రమాణ స్వీకారానికి లావణ్య త్రిపాఠి హాజరు కాకపోవడానికి కారణాలివేనా?