రథసప్తమి రోజు పఠించాల్సిన శ్లోకాలు.. ఈ వ్రతం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది..!
TeluguStop.com
ప్రతి సంవత్సరం మాఘ మాసంలో వచ్చేటటువంటి సప్తమిని రథసప్తమిగా జరుపుకుంటారు.ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి 19న కావడంతో రథ సప్తమి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.
లోకానికి వెలుగును ప్రసాదించే ప్రదాత, ఎన్నో జీవరాశులకు ఆధారమైన సూర్యభగవానునికి రథసప్తమి రోజు ఎంతో ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తారు.
ముఖ్యంగా హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజు రథ సప్తమి వేడుకలను పెద్ద పండుగగా జరుపుకుంటారు.
ఈ రథసప్తమి రోజున హిందువులందరూ సూర్యుడి పుట్టినరోజు గా భావించి ఆ సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
సాధారణంగా సూర్యుడు జన్మదినం కావడంతో ఆయన పేరుతో పిలవకుండా రథసప్తమి అనే పేరుతో పిలవడానికి గల కారణం ఏమిటంటే.
సూర్యుడు రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రి అనే తేడా లేకుండా తిరుగుతూ ఉంటుంది.
అదేవిధంగా రథానికి ఉన్న చక్రంలో ఆరు ఆకులు ఉండటంవల్ల ఈ ఆరు ఆకులు ఆరు ఋతువులను సూచిస్తాయి.
అందుకోసమే ఆ సూర్యుని జన్మదినాన్ని రథసప్తమిగా పిలుస్తారు.ఈ మాఘ శుద్ధ సప్తమి రోజున సాక్షాత్తు సూర్యగ్రహణంగా భావించి వేకువజామునే స్నానాలు ఆచరిస్తారు.
రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు తలపై జిల్లేడు ఆకులు, రేగు ఆకులు పెట్టుకుని స్నానం చేయటం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని భావిస్తారు.
"""/" /
H3 Class=subheader-styleరథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు పాటించాల్సిన శ్లోకాలు ఇవే.
/h3p
నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు! తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్! మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే! సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!! """/" /
రథసప్తమి రోజు సూర్య భగవానుడికి ఎర్రచందనం, ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి.
అదేవిధంగా ఆవు పిడకల మీద స్వామి వారికి క్షీరాన్నం నైవేద్యంగా చేయాలి.ఈ క్షీరాన్నం చేసేటప్పుడు చెరుకు గడలతో కలియబెడుతూ నైవేద్యం తయారు చేయడం వల్ల స్వామివారి ప్రీతి చెందుతారు.
అదే విధంగా ఈ రథసప్తమి వ్రతాన్ని ఆచరించేవారు పూజ చేస్తున్న సమయంలో ఎవరికైతే సంతానం కలగలేదో వారి ఇంటి పేరు గోత్రనామాలు పలుకుతూ పూజ చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.
సెల్ ఫోన్ ముట్టుకోలేదు.. సివిల్స్ లో 11వ ర్యాంక్.. సాయి శివాని సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!