సీనియర్ సిటిజన్ల కోసం ఓ స్టార్టప్ స్టార్ట్ చేయబోతున్న రతన్ టాటా!

రతన్ టాటా.పరిచయం అక్కర్లేని పేరు.

అయినా ఒకసారి పరిచయం చేసుకుందాం.రతన్ నవల్ టాటా భారతదేశ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ కు ఒకప్పటి చైర్మన్.

1990 నుండి 2012 వరకు టాటా గ్రూపుకు చైర్మన్ గా వున్న ఆయన తరువాత అక్టోబరు 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు టాటా గ్రూఫుకు ఇంటెరిమ్‌ చైర్మన్ గా ఉన్నాడు.

ప్రస్తుతం టాటా ఛారిటబుల్ ట్రస్టులకు అధిపతిగా కొనసాగుతున్నాడు.1937లో టాటా కుటుంబంలో టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జమ్‌షెడ్జీ టాటా కు మునిమనుమడుగా జన్మించాడు.

1991 లో జె.ఆర్.

డి టాటా పదవీ విరమణ చేసిన తరువాత అతనికి వారసునిగా భాద్యతలు చేపట్టాడు.

భారతీయులలో అత్యున్నతమైన సంపన్నులలో ఈయన ఒకరు.ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయన గొప్ప పారిశ్రామికవేత్తగా పేరుపొందారు.

కాగా రతన్ టాటాకు మన దేశంలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది.చాలా మంది ఆయన ఐడియాలజీకి ఫ్యాన్స్ అయితే మరి కొందరు అతని సింప్లిటీకి ఫిదా అవుతారు.

ఇకపోతే రతన్ టాటా తాజాగా ఓ స్టార్టప్ కంపెనీ 'గుడ్ ఫెలోస్'లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు.

"""/"/ 'గుడ్ ఫెలోస్' సంస్థను షంతను నాయుడు సీనియర్ సిటిజన్స్‌కు సేవ అందించేందుకు స్థాపించాడు.

ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఇప్పుడు రతన్ టాటా ముందుకు రావడం ఇపుడు మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా టాటా ఈ సంస్థను ప్రారంభించారు.ఈ సందర్భంగా టాటా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'ఒంటరిగా జీవితం గడపడం, ఓ తోడు కోసం ఎదురుచూడటం ఎలా ఉంటుందో మీకు తెలీదు' అని అన్నారు.

అంతేకాకుండా తాము వృద్ధులు అయ్యేవరకు ఎవరూ కూడా వృద్ధాప్యం గురించి పట్టించుకోరు అని రతన్ టాటా అన్నారు.

ప్రభాస్ కాలికి గాయం ఇంకా మానలేదా.. నవ్వుతూనే బాధ భరిస్తున్నారా?