ఆ ఓటీటీలో రతన్ టాటా డాక్యుమెంటరీ.. నానో కారు వెనుక అసలు కథ ఇదే!
TeluguStop.com
ప్రముఖ పారిశ్రామికవేత్త మంచి వ్యక్తి గొప్ప విలువలు కలిగిన వ్యక్తి అయినా రతన్ టాటా( Ratan Naval Tata) గారు పజగ మరణించిన విషయం తెలిసిందే.
యావత్ భారతదేశం ఈ విషయం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.ప్రతి ఒక్కరూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
ఎన్నో మంచి మంచి పనులను చేసి ప్రతి ఒక్కరి మనసులను గెలుచుకున్నారు రతన్ టాటా గారు.
అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఇక లేరనే వార్తా ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది.
ఇక చాలామంది ఆయనతో వారికి ఉన్న అనుభవాలను సంబంధాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్టులు కూడా చేస్తున్నారు.
"""/" /
ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన బయోపిక్, డాక్యుమెంటరీల గురించి వెతుకుతున్నారు.
ఈ దార్శనికుడి గురించి డిస్నీ+ హాట్‌స్టార్(
Disney+ Hotstar ) ఒక ఎపిసోడ్ చేసింది.
మెగా ఐకాన్స్ సీజన్2( Mega Icons Season 2 )లో ఎపిసోడ్2 లో రతన్ అతిథిగా హాజరై తన ప్రయాణానికి సంబంధించిన కొన్ని విశేషాలను పంచుకున్నారు.
తక్కువ ధరలో కారు తీసుకురావాలనే ఆలోచన వెనక ఉన్న కారణాన్ని వివరించారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.
ఒకసారి నేను కారులో వెళ్తూ స్కూటర్‌పై వెళ్తున్న కుటుంబాన్ని చూశాను.తల్లి, తండ్రితో పాటు ఇద్దరు పిల్లలు మొత్తం నలుగురూ ఒకే స్కూటర్‌పై వెళ్తున్నారు.
కొంతసేపటికి వాళ్లు జారి కిందపడ్డారు. """/" /
ఆ సంఘటన నన్ను ఆలోచింపజేసింది.
స్కూటర్ ను సేఫ్టీగా ఎలా మార్చాలి అని ఆలోచించాను.ఆ ఆలోచనే తక్కువ ధరకు కారు తయారు చేసేలా ప్రోత్సహించింది అని రతన్ టాటా తెలిపారు.
దీన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన పడిన కష్టాన్ని ఆ ఎపిసోడ్ లో రతన్ వివరించారు.
ప్రస్తుతం ఇది ఐదు భాషల్లో అందుబాటులో ఉంది.తెలుగు, హిందీ, తమిళ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో దీన్ని డిస్నీ+ హాట్‌స్టార్ లో కూడా వీక్షించవచ్చు.
ఈ డాక్యుమెంటరీ ఆసియా టెలివిజన్ అవార్డుకు నామినేట్ అయి ఉత్తమ డాక్యుమెంటరీగా సిరీస్ టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే.
ఆ డాక్యుమెంటరీని చూసిన ప్రతి ఒక్కరూ ఆయనను మరొకసారి గుర్తు తెచ్చుకుంటున్నారు.
ఎలిమినేట్ అయిన యష్మీ గౌడ..12 వారాలకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?