దేశ మాజీ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ జయంతి సందర్భంగా రాష్ర్టీయ ఏక్తాదివస్‌ ప్రతిజ్ఞ..

రాజన్న సిరిసిల్ల జిల్లా: భారత తొలి ఉప ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌( Sardar Vallabhbhai Patel ) 148 జయంతి వేడుకలు పురస్కరించుకుని ఏక్తా దివస్‌ వేడుకలు మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.

‘ రాష్ర్టీయ ఏక్తా దివస్‌’లో భాగంగా మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏక్తా దివస్‌ ప్రతిజ్ఞ చేయించారు.

జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్( N Khimya Naik, ) నేతృత్వంలో సిబ్బంది చేత ఏక్తాదివస్‌ ప్రతిజ్ఞ చేయించారు.

ఈసందర్భంగా దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను పరిరక్షించడానికి నాకు నేనుగా అంకితమవుతూ నా తోటి దేశ వాసుల్లో ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి కూడా శాయశక్తులా కృషి చేస్తానని, సత్యనిష్టతో నే ను ప్రమాణం చేస్తున్నాను.

ఈ ఐక్యత సర్ధార్‌ వల్లభాయ్‌పటేల్‌ దార్శనీయత, చర్యల ద్వారా సాకారం అయింది.నా దేశ అంతర్గత భద్రతను కాపాడడానికి నా స్వంత తోడ్పాటును అందించాలని కూడా నేను సత్యనిష్టతో తీర్మానిస్తున్నానను అని ప్రతిజ్ఞ చేయించారు.

 స్వాతంత్ర్య అనంతరం భారత్ ఐక్యతకు సర్ధార్ పటేల్ చేసిన కృషినీ ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ గుర్తుచేసి, దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, కలెక్టరేట్ ఏవో రామ్ రెడ్డి, పర్యవేక్షకులు శ్రీకాంత్ , వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసిన మాధవీలత.. ఆమెకు న్యాయం జరుగుతుందా?