ఓ వైపు మహేష్ మరో వైపు అఖిల్! రష్మిక రొమాన్స్ లో స్పీడ్ పెంచుతుంది

చలో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మంధన మొదటి సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇక రెండో సినిమా గీతాగోవిందం సినిమాతో తన ఇమేజ్ ని అమాంతం పెంచుకుంది.

దీంతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గగా మారిపోయి హీరోల ఫస్ట్ ఛాయస్ అయిపొయింది.

దీంతో కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ రష్మికపై మనసు పారేసుకొని ఆమెతో నటించడానికి ఇష్టపడుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మరోసారి విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న రష్మిక ప్రస్తుతం నితిన్ తో భీష్మ సినిమాలో నటించనుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కబోయే సినిమాలో రష్మికని హీరోయిన్ గా తీసుకున్నారు.

అలాగే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అఖిల్ హీరోగా తెరపైకి ఎక్కే సినిమాలో రష్మికని హీరోయిన్ గా ఫైనల్ చేసారు.

ఇదిలా ఉంటే మరో వైపు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో కూడా రష్మికని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

దీంతో ఈ భామ ఇప్పుడు ఏకంగా ఐదు క్రేజీ ప్రాజెక్ట్ లని తన చేతిలో పెట్టుకుంది అని చెప్పాలి.

నాగార్జునతో అలాంటి సినిమా తీస్తానని చెబుతున్న అనిల్ రావిపూడి.. ఈ కాంబో సాధ్యమేనా?