రష్మిక స్టార్ డం ఆ హీరోయిన్ పెట్టిన బిక్షేనా.. వెలుగులోకి వచ్చిన నిజం!

నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నటువంటి నటి రష్మిక మందన్న ( Rashmika Mandanna )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

ఇటీవల యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక అనంతరం బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

అయితే ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

కన్నడ చిత్ర పరిశ్రమలో ఈమె మొదటిసారి హీరో రక్షిత్ శెట్టితో కలిసి కిరీక్ పార్టీ ( Kirik Party ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

"""/" / ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈమెకు అనంతరం తెలుగులో కూడా సినిమా అవకాశాలు వచ్చాయి.

తెలుగులో నాగశౌర్య హీరోగా నటించిన చలో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.

అయితే కన్నడ చిత్ర పరిశ్రమలో ఈమె కిరిక్ పార్టీ సినిమా అవకాశం అందుకోవటం ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ స్థాయిలో ఉన్నారని చెప్పాలి.

కానీ రష్మికకు ఈ స్టార్ డమ్ రావడం మరొక స్టార్ హీరోయిన్ పెట్టినటువంటి భిక్ష అని తెలుస్తుంది.

"""/" / ముందుగా ఈమె నటించిన కిరిక్ పార్టీ సినిమాలో రష్మికను కాకుండా మరొక హీరోయిని ఎంపిక చేసుకున్నారట అయితే ఆ హీరోయిన్ కొన్ని కారణాలవల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం రష్మికకు వచ్చిందని తెలుస్తుంది.

మరి ఈ సినిమాని రిజెక్ట్ చేసిన ఆ హీరోయిన్ మరెవరో కాదు ఆమె సాయి పల్లవి( Sai Pallavi ) అని తెలుస్తుంది.

సాయి పల్లవి ఈ సినిమాని రిజేక్ట్ చేయడంతో రష్మిక ఈ సినిమాకు అవకాశం అందుకున్నారు ఇలా ఈ సినిమా సక్సెస్ కావడంతో నేడు ఈమె నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఒక విధంగా చూసుకుంటే సాయి పల్లవి కారణంగానే రష్మిక ఈ స్థాయిలో ఇండస్ట్రీలో సక్సెస్ సాధించారని చెప్పాలి.

కల్కి కోసం అలనాటి హీరోయిన్ ను ఎందుకు తీసుకువచ్చారు.. ఆమె పాత్ర ఏంటి..?