హ్యాక్ అయిన రష్మిక ఇన్ స్టా అకౌంట్... అసలు విషయం చెప్పిన రష్మిక!
TeluguStop.com
ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే అగ్రతారక ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నేషనల్ క్రష్ రష్మిక ఒకరు.
ఇలా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే వివిధ భాషలలో సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకున్న రష్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఇలా సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రష్మిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్ కి గురైనట్లు తెలుస్తోంది.
సోమవారం రష్మిక ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఆమె పేరు రివర్స్ ఆర్డర్‌లో కనిపించడంతో అభిమానులు తమ అభిమాన నటి రష్మిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని ఆందోళన చెందారు.
ఇలా రష్మిక ఇంస్టాగ్రామ్ గురించి వార్తలు రావడంతో చివరికి ఈమె ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే రష్మిక ఈ విషయంపై స్పందిస్తూ.బాలిక విద్య ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు 'ప్లమ్ ప్రాజెక్ట్ బ్లాక్‌బోర్డ్' ప్రచారంలో ఇదంతా ఒక భాగమని ఈమె తెలియజేశారు.
"""/" /
రివర్స్ ఆర్డర్లో ఉన్న తన పేరుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.
చదవడం తెలియనప్పుడే చిన్నారులు ఇలా భావిస్తారు.దానిని మార్చే లక్ష్యంతో ప్లం గుడ్‌నెస్ పనిచేస్తోంది అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అసలు విషయం చెప్పడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ప్రస్తుతం ఈమె రష్యాలో పుష్ప సినిమా విడుదలైన నేపథ్యంలో అక్కడ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ ఉన్నారు.
ఇక త్వరలోనే ఈమె నటించిన వరిసు సినిమా కూడా విడుదల కానుంది.అదేవిధంగా పుష్ప 2 సినిమా షూటింగ్లో కూడా రష్మిక బిజీ కానున్నారు.
వయస్సు 69.. లుక్స్ మాత్రం 29.. చిరంజీవి లేటెస్ట్ లుక్స్ చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే!