అప్పుడే ఇలాంటి నిర్ణయాలు ఎందుకమ్మా గీతా

‘ఛలో’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన రష్మిక మందన ఆ చిత్రంతో పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు.

ఛలో చిత్రం సక్సెస్‌ అయినా కూడా రష్మిక మందనకు వరుసగా ఆఫర్లు రాలేదు.

కాని తాజాగా చేసిన ‘గీత గోవిందం’ చిత్రంతో రష్మిక ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయ్యింది.

విజయ్‌ దేవరకొండతో చేసిన ఆ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకుంది.ఇక ఆ చిత్రంలో గీత పాత్రలో అద్బుతమైన నటనను కనబర్చడంతో పాటు విజయ్‌తో పోటీ పడి మరీ రొమాన్స్‌ చేయడం జరిగింది.

దాంతో సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయంది.రష్మిక మందన త్వరలోనే బిజీ హీరోయిన్‌ అవ్వబోతుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ‘గీత గోవిందం’ విడుదలకు ముందే విజయ్‌ దేవరకొండతోనే తన మూడవ సినిమాను చేసేందుకు రష్మిక మందన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

భరత్‌ కమ్మ దర్శకత్వంలో రూపొందబోతున్న ‘డియర్‌ కామ్రెడ్‌’ చిత్రంలో విజయ్‌తో కలిసి రష్మిక నటించబోతుంది.

ఇప్పటికే ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది.ఇక రష్మిక ఈ చిత్రం కోసం మేకప్‌ లేకుండా నటించబోతుంది అంటూ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

కథానుసారంగా ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు మేకప్‌ అవసరం లేదని, సహజంగా కనిపించేందుకు దర్శకుడు రష్మికకు మేకప్‌ లేకుండానే టెస్టు షూట్‌ చేయడం అందుకు ఓకే అవ్వడం జరిగి పోయింది.

‘డియర్‌ కామ్రెడ్‌’ చిత్రంలో రష్మిక క్రికెట్‌ క్రీడాకారిణిగా కనిపించబోతుంది.క్రీడాకారిణి కనుక మేకప్‌ వేసుకుని నటిస్తే బాగుండదు అనే ఉద్దేశ్యంతో దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు.

మామూలుగా అయితే హీరోయిన్స్‌ మేకప్‌ లేకుండా అస్సలు బయట కనిపించరు.ఇక సినిమాల్లో అయితే అసలు కనిపించరు.

ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్స్‌ గ్లామర్‌గానే కావాలి.కనుక మేకప్‌తోనే అందరు హీరోయిన్స్‌ సినిమాల్లో నటిస్తూ వస్తుంటారు.

అయితే రష్మిక మేకప్‌ లేకుండా నటించడం అనేది సాహస నిర్ణయం అంటూ కొందరు అంటున్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇప్పటి వరకు కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసింది.

అదృష్టం బాగుండి ఆ రెండు సినిమాలు సక్సెస్‌ అయ్యాయి.ఇప్పుడు మూడవ సినిమాకే మేకప్‌ లేకుండా చేయడం అనేది పెద్ద సాహసంగా చెప్పుకోవచ్చు.

అలాంటి సాహసం ఇంత తక్కువ కెరీర్‌ స్పాన్‌లో చేయడం పొరపాటు నిర్ణయం అంటున్నారు.

సినిమా సక్సెస్‌ అయితే ఎవరు పట్టించుకోరు, ఫలితం తారు మారు అయితే మాత్రం రష్మిక నిర్ణయంను అంతా కూడా తప్పుపట్టడం ఖాయం.

అల్లు అర్జున్ భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా..?