బేబీ సినిమాకు విజయ్, రష్మిక రివ్యూ ఇదే.. ఆనంద్, వైష్ణవి గురించి అలా చెబుతూ?
TeluguStop.com
ఈరోజు విడుదలైన బేబీ సినిమా( Baby Movie ) గురించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ చర్చ జరుగుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను మరీ దారుణంగా చూపించారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇలాంటి పాత్ర పోషించిన వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) గట్స్ కు కూడా కూడా హ్యాట్సాఫ్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ సినిమా గురించి రష్మిక స్పందించి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు.
బేబీ సినిమా చూసి రష్మిక( Rashmika ) ఎమోషనల్ కావడంతో పాటు సినిమా బాగుందని చెప్పుకొచ్చారు.
రష్మిక తనకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసిందని చెప్పకనే చెప్పేశారు.విజయ్ దేవరకొండ ఈ సినిమా గురించి స్పందిస్తూ ఆసక్తికర కామెంట్లు చేశారు.
ఈరోజు నేనెంతో గర్వపడుతున్నానని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.ఎస్కేఎన్, సాయి రాజేశ్ అద్భుతమైన సినిమాను ప్రేక్షకులకు అందించారని ఆయన పేర్కొన్నారు.