అలా తోడుండే భాగస్వామి కావాలి.. హీరోయిన్ రష్మిక సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన( Rashmika Mandanna ) గురించి మనందరికీ తెలిసిందే.

రష్మిక ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా హిందీ తెలుగు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంది.

ఇటీవల కాలంలో రష్మిక నటించిన సినిమాలన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ మంచి సక్సెస్ అవుతుండడంతో ఈమెకు అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి.

ఇకపోతే తాజాగా రష్మిక అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కోట్లల్లో కలెక్షన్స్ను సాధిస్తూ దూసుకుపోతుండడంతో ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది రష్మిక మందన.

"""/" / ఈ నేపథ్యంలోనే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఫుల్ బిజీబిజీగా ఉంది.

ఈ విజయోత్సహంలో భాగంగానే తాజాగా ఆమె రిలేషన్షిప్ గురించి ప్రేమ విషయం గురించి మాట్లాడారు.

ఈ మేరకు రష్మిక మాట్లాడుతూ.నా భాగస్వామి( Life Partner ) నా జీవితంలోని ప్రతీ దశలోను తోడు ఉండాలి.

అన్నివేళలా నాకు భద్రతనివ్వాలి.జీవితంలోని కష్ట సమయంలో నాకు సపోర్ట్‌ చేయాలి.

కచ్చితంగా ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి.శ్రద్ధ వహించాలి.

మంచి మనసు ఉండాలి.ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉంటే జీవితమంతా కలిసి ఉండవచ్చు అని తెలిపింది రష్మిక.

"""/" / అనంతరం ప్రేమ గురించి మాట్లాడుతూ.జీవితంలో ప్రతి ఒక్కరికీ తోడు కావాలి.

నా దృష్టిలో ప్రేమలో ఉండడం అంటే భాగస్వామిని కలిగి ఉండడమే.తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదు.

మన ఒడుదొడుకుల్లో మనతో ఉండి సపోర్ట్‌ చేసేవారు ఉండాలి అని తెలిపింది.ఈ సందర్భంగా రష్మిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రస్తుతం రష్మిక చేతిలో ఇంకా మూడు నాలుగు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.పుష్ప సినిమా సక్సెస్ తో ఆ సినిమాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్‌ వీడ్కోలు!