రష్మిక విషయంలో భయపడుతున్న ఆమె కుటుంబ సభ్యులు.. ఏమైందంటే?

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో రష్మిక టాప్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే.

రష్మిక నటిస్తే సినిమా బ్లాక్ బస్టర్ అని చాలామంది భావిస్తారంటే రష్మికకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో సులభంగానే అర్థమవుతుంది.

రష్మిక నటించిన గుడ్ బై మూవీ 2022 సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ ఫీల్ గుడ్ మూవీకి క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

అయితే రష్మికకు సంబంధించి ఒక విషయంలో ఆమె తల్లీదండ్రులు తెగ టెన్షన్ పడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

ఒక టాలీవుడ్ హీరోతో రష్మిక ప్రేమలో ఉన్నారని ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చినా రష్మిక ఆ హీరో తనకు ఫ్రెండ్ మాత్రమే అని ఇంటర్వ్యూలలో వెల్లడించడం గమనార్హం.

గుడ్ బై సినిమా ప్రమోషన్లలో భాగంగా తన ఫ్యామిలీకి సంబంధించి రష్మిక ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

నేను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలని అనుకున్న సమయంలో నా కుటుంబ సభ్యులు వద్దని చెప్పారని ఆమె కామెంట్లు చేశారు.

నా పేరెంట్స్ నాకు ఎప్పటికీ తోడుగా ఉంటారని నేను తీసుకునే నిర్ణయాలకు వాళ్లు అడ్డు చెప్పలేదని ఆమె అన్నారు.

అదే సమయంలో పేరెంట్స్ చెప్పే ప్రతి మాటను నేను అంగీకరిస్తానని ఆమె కామెంట్లు చేశారు.

నేను సినిమా రంగంలోకి రావాలనుకున్న సమయంలో ఆ ప్రపంచంలో ఎలా ఉండగలవని పేరెంట్స్ అడిగారని రష్మిక తెలిపారు.

"""/"/ నాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలో నాకు తెలుసని అయితే ఇప్పటికీ నా పేరెంట్స్ నా గురించి ఆందోళన చెందుతున్నారని రష్మిక చెప్పుకొచ్చారు.

రష్మిక చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.రష్మిక నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

భార్య మంగళ సూత్రం అమ్మి పేకాట.. ఆ వ్యక్తికి పవన్ కళ్యాణ్ చుక్కలు చూపించారా?