విజయ్ దేవరకొండతో రిలేషన్ పై ఓపెన్ అయిన రష్మిక.. అన్ని షేర్ చేసుకుంటామంటు కామెంట్స్?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో గీతగోవిందం డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ, నటి రష్మిక.
ఇలా ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పినప్పటికీ ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు అయితే తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఒకేసారి మాల్దీవులకు వెళ్లడంతో వీరి గురించి పెద్ద ఎత్తున ట్రోల్స్ మొదలయ్యాయి.
వీరిద్దరూ రహస్యంగా వీరి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారని ఇలా పెళ్లికి ముందే మాల్దీవ్స్ వెళ్లారంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు.
ఇకపోతే తాజాగా ఈ ఇద్దరు మాల్దీవులకు గుడ్ బై చెప్పి ఇండియాకి తిరిగి వచ్చారని తెలుస్తోంది.
ఇలా ఇద్దరు కలిసి ఒకేసారి ఎయిర్ పోర్ట్ లో కెమెరాలకు చిక్కారు.ఈ క్రమంలోనే మరోసారి రష్మికకు విజయ్ దేవరకొండతో తనకు ఉన్నటువంటి రిలేషన్ గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఈసారి ఈమె ఈ రిలేషన్ పై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
"""/" /
ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ తాను విజయ్ దేవరకొండ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని,ఇద్దరం చాలా సన్నిహితంగా ఉంటాము.
ఇక నాకు సినిమాల పరంగా ఎలాంటి సందేహాలు వచ్చినా విజయ్ దేవరకొండతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటానని మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొత్తానికి రష్మిక వీరిద్దరి మధ్య ఉన్న రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
అయితే ఇకపై వీరి గురించి ఇలాంటి వార్తలు రావడం ఆగిపోతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.
అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం వెనక ఎవరు ఉన్నారు…